Nokia G60 5G: నోకియా జీ 60 5జీ సేల్స్ మొదలు.. ధర ఫీచర్లు ఇవే?

ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ నోకియా ఇప్పటికే ఎన్నో రకాల మొబైల్స్ ను అలాగే ట్యాబులను మార్కెట్ లోకి

  • Written By:
  • Publish Date - November 8, 2022 / 04:30 PM IST

ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ నోకియా ఇప్పటికే ఎన్నో రకాల మొబైల్స్ ను అలాగే ట్యాబులను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి సరికొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది నోకియా సంస్థ. ఇది ఇలా ఉంటే నోకియా సంస్థ తాజాగా భారత్ మార్కెట్ లోకి 5 జీ స్మార్ట్ ఫోన్ జీ 60 ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్ పూర్తిగా 5జి కనెక్టివిటీని కలిగి ఉంది. ఇది ఇలా ఉంటే గత వారం లాంచ్ చేసిన ఈ నోకియా జీ60, 5 జీ స్మార్ట్ కు ఫోన్ కి సంబంధించిన సేల్స్ తాజాగా భారత్ లో మొదలయ్యాయి.

5జీ నెట్ వర్క్ సపోర్ట్ 50 మెగాపిక్సల్ కెమెరాతో పాటుగా ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి అద్భుతమైన ఫీచర్ లతో ఈ 5జి స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ని నోకియా ఇండియా సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ 5జీ స్మార్ట్ ఫోన్ నలుపు అలాగే ఐస్ కలర్ లలో అందుబాటులో ఉంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ ల వివరాల విషయానికి వస్తే.. నోకియా జీ60 5జీ స్మార్ట్ ఫోన్ 6.58 అంగుళాల ఫుల్ హెచ్డి+డిస్ప్లే ఉంటుంది.

50మెగా పిక్సెల్‌ ప్రైమరీ కెమెరా సెన్సార్‌లో పవర్‌ఫుల్‌ కెమెరా లభ్యం అవుతుంది. 5 మెగా పిక్సెల్‌ అల్ట్రావైడ్‌ యాంగిల్ సెన్సార్‌, 2మెగా పిక్సెల్‌ డెప్త్‌ సెన్సార్‌ లభిస్తాయి. వీటితోపాటు 8-మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా కూడా లభ్యం అవుతుంది. 6జీబీ రామ్‌తోపాటు 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ సామర్థ్‌యం కలిగి ఉంటుంది. నోకియా జీ 60 ఫోన్‌ 6.5 అంగుళాల డిస్‌ప్లే విత్‌ రీఫ్రెష్‌ రేట్‌ 120హెర్ట్జ్‌, 1080×2400 పిక్సెల్స్‌తో కూడిన ఫుల్‌ హెచ్డీ రిజొల్యూషన్‌ లభిస్తుంది. స్క్రీన్‌పై గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ ఉంటుంది. నోకియా జీ 60 5జీ ఫోన్‌ 4500ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.29,999 గా వుంది.