Nokia C22 : సూపర్ ఫీచర్స్ తో 7వేలకే స్మార్ట్ ఫోన్

నోకియా.. ఒకప్పుడు మొబైల్ ఫోన్ రంగంలో పెను సంచలనం!! కానీ మారిన కాలానికి అనుగుణంగా మారక.. వేగంగా స్మార్ట్ ఫోన్ తయారీ టెక్నాలజీని అందుకోలేక చతికిలపడింది. ఇప్పుడు నోకియా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. స్మార్ట్ ఫోన్ల విభాగంలో ఉనికిని చాటుకునేందుకు చెమటోడుస్తోంది. ఈక్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా ఉన్న భారత్ లో నోకియా C22 (Nokia C22) స్మార్ట్ ఫోన్ మోడల్ ను తాజాగా రిలీజ్ చేసింది.

  • Written By:
  • Publish Date - May 12, 2023 / 11:22 AM IST

నోకియా.. ఒకప్పుడు మొబైల్ ఫోన్ రంగంలో పెను సంచలనం!! కానీ మారిన కాలానికి అనుగుణంగా మారక.. వేగంగా స్మార్ట్ ఫోన్ తయారీ టెక్నాలజీని అందుకోలేక చతికిలపడింది. ఇప్పుడు నోకియా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. స్మార్ట్ ఫోన్ల విభాగంలో ఉనికిని చాటుకునేందుకు చెమటోడుస్తోంది. ఈక్రమంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్ గా ఉన్న భారత్ లో నోకియా C22 (Nokia C22) స్మార్ట్ ఫోన్ మోడల్ ను తాజాగా రిలీజ్ చేసింది. దీని ధర కేవలం రూ.7,999. అన్ని ఫీచర్స్ ఉన్నా.. అతి తక్కువ ధరకు దొరుకుతోంది కాబట్టే నోకియా C22 (Nokia C22) స్మార్ట్ ఫోన్ పై అన్ని చోట్లా డిస్కషన్ జరుగుతోంది.ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు nokia.com మరియు అధీకృత రిటైల్ స్టోర్‌లలో సేల్స్ కు అందుబాటులో ఉంది.

also read : Nokia: 60 ఏళ్లలో తొలిసారి తన లోగో మార్చుకున్న నోకియా !

నోకియా C22 (Nokia C22) ఫీచర్స్ ఇవే..

  •  5000 mAh బ్యాటరీ
  • సరసమైన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ HD+ డిస్‌ప్లే
  • 2GB RAM మరియు 4GB RAM తో కూడిన రెండు వేరియంట్లలో లభ్యం
  • 2GB RAM ధర రూ.7,999, 4GB RAM ధర రూ.8,499
  • చార్‌కోల్, సాండ్, పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో లభ్యం
  • 720×1600 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.5 అంగుళాల స్పోర్ట్స్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే 20:9 యాస్పెక్ట్ రేషియోను అందిస్తుంది.
  • టఫ్‌నెడ్ గ్లాస్ పొరతో రక్షణ ఉంటుంది.
  • ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ యునిసోక్ SC9863A చిప్‌సెట్‌ ద్వారా పనిచేస్తుంది.
  • 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
  • వినియోగదారులు మైక్రో SD కార్డ్‌ని 256GB వరకు జోడించడం ద్వారా ఇంటర్నల్ స్టోరేజ్ ను పెంచుకోవచ్చు.
  • నోకియా C22 ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్)పై నడుస్తుంది.
  • దీనికి డ్యూయల్ సిమ్ సపోర్ట్‌ ఉంటుంది.
  • స్మార్ట్‌ఫోన్ 13MP ప్రధాన సెన్సర్ , 2MP మాక్రో షూటర్‌తో కూడిన డ్యూయల్ బ్యాక్ సైడ్ కెమెరాను కలిగి ఉంది.
  • ఈ ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది.
  • ఈ ఫోన్ వెనుక మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ ఉంది.
  • ఇది IP52 రేటింగ్‌తో వస్తుంది.
  • దుమ్ము , స్ప్లాష్-రెసిస్టెంట్‌గా ఈ ఫోన్ పని చేస్తుంది.
  • ఈ స్మార్ట్‌ఫోన్ 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000mAh బ్యాటరీ ద్వారా పని చేస్తుంది.