WhatsApp Feature Update:వాట్సాప్ లో పాత చాట్స్ ఈజీగా చూసేందుకు కొత్త ఫీచర్ వస్తోందహో!!

సరికొత్త ఫీచర్స్ తో వాట్సాప్ దూసుకుపోతోంది. పాత మెసేజ్ లను వెతికే క్రమంలో వినియోగదారులు పడే ఇబ్బందులను తొలగించేందుకు..

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 11:44 AM IST

సరికొత్త ఫీచర్స్ తో వాట్సాప్ దూసుకుపోతోంది. పాత మెసేజ్ లను వెతికే క్రమంలో వినియోగదారులు పడే ఇబ్బందులను తొలగించేందుకు.. ఒక కొత్త ఫీచర్ ను వాట్సాప్ తీసుకురాబోతోంది. పాత మెసేజ్ లను వెతికే క్రమంలో.. వాటిని పైకి, కిందికి స్క్రోల్ చేసేందుకు ఎంతో సమయం పడుతుంది. ఇకపై ఆ అవసరం లేకుండా కేవలం డేట్ ను టైప్ చేస్తే చాలు.. ఆ డేట్ రోజుకు సంబంధించిన చాటింగ్స్ ప్రత్యక్షం అవుతాయి. గత రెండేళ్లుగా ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని తెలుస్తోంది. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తేవాలని వాట్సాప్ యోచిస్తోంది. వాట్సాప్ లో కీ బోర్డ్ ఆప్షన్ ను క్లిక్ చేయగానే క్యాలెండర్ ను సూచించే ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఈ ఐకాన్ పై క్లిక్ చేసి.. డేట్ ను సెలెక్ట్ చేసుకుంటే.. ఆ తేదీ రోజు జరిగిన చాటింగ్ కనిపిస్తుంది.
ఈ కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టడానికి ముందు.. వినియోగదారులతో వాట్సాప్ సర్వే చేయనుంది. ఫీచర్ లోని లోటుపాట్లను తెలుసుకొని దాన్ని మరింత యూజర్ ఫ్రెండ్లి గా డెవలప్ చేయనుంది.

ఎవరికి వారే మెసేజ్‌లు..

యూజర్లు ఓన్ చాట్ ఓపెన్ చేసి ఎవరికి వారే మెసేజ్‌లు చేసుకునేందుకు వీలుగా ఒక ఫీచర్ పరిచయం చేయనుంది. ఈ విషయాన్ని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. ప్రస్తుతానికి యూజర్లు తమకు తామే మెసేజ్ చేసుకోవాలంటే wa.me/919856xxxx అని టైప్ చేసి ఒక యూఆర్ఎల్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తోంది.ఈ యూఆర్ఎల్‌లో కనిపించే 9856xxxx అనే నంబర్ యూజర్ల ఓన్ ఫోన్ నంబర్ అయి ఉండాలి. కానీ ఈ ట్రిక్ లింక్డ్‌ డివైజ్‌ల్లో పని చేయదు. ఆ సమస్యను కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్‌తో వాట్సాప్ పరిష్కరించనుంది. మరి అదెలాగో తెలుసుకుందాం.

మల్టీ డివైజ్‌లలో కూడా..

మల్టీ డివైజ్‌లలో కూడా ఓపెన్ చాట్ ఫీచర్ వస్తున్నట్లు వాట్సాప్ ట్రాకర్ WABetaInfo కొద్ది రోజుల క్రితం తెలిపింది. దీనర్థం మీ దగ్గర ప్రైమరీ ఫోన్ లేకపోయినా, మీ వాట్సాప్ లింక్డ్‌ డివైజ్‌ల్లో మీ సొంత నంబర్‌కు మెసేజ్ పంపవచ్చు. నిజానికి ఎవరికి వారు చాటింగ్ చేసుకోరు కానీ ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఓన్ చాట్‌లో సేవ్ చేసుకోవడానికి లేదా పాస్‌వర్డ్ వంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఫీచర్ గురించి తాజాగా ఒక రిపోర్టు ఆసక్తికర విషయాలు పంచుతుంది.