Apple Smart Watch: యాపిల్ నుంచి మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ వాచ్.. ధర ఫీచర్స్ ఇవే?

ప్రస్తుత జనరేషన్ లో చాలామంది యువత యాపిల్ బ్రాండ్ కి సంబంధించిన స్మార్ట్ వాచ్,స్మార్ట్ ఫోన్ ని వినియోగించాలని

  • Written By:
  • Publish Date - February 4, 2023 / 07:00 AM IST

ప్రస్తుత జనరేషన్ లో చాలామంది యువత యాపిల్ బ్రాండ్ కి సంబంధించిన స్మార్ట్ వాచ్,స్మార్ట్ ఫోన్ ని వినియోగించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ వాటి ధర కారణంగా చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. చాలామంది యువతకు యాపిల్ కలల. బ్రాండ్ అని చెప్పవచ్చు. అయితే వినియోగదారులకు అనుగుణంగా యాపిల్ కంపెనీ కూడా కొత్త కొత్త ఫీచర్స్ కలిగిన యాపిల్ స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్ ఇయర్ బర్డ్స్ ని అతి తక్కువ ధరకే మార్కెట్లోకి తీసుకు వస్తోంది. మరి ముఖ్యంగా యాపిల్ సంస్థ కొత్త ఫీచర్స్ కలిగిన స్మార్ట్ వాచ్,స్మార్ట్ ఫోన్ లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే యాపిల్ కంపెనీ మార్కెట్ లోకి కొత్త స్మార్ట్ వాచ్ ని వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

యాపిల్ కంపెనీ వచ్చే ఏడాది 2.1 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో కొత్త యాపిల్ వాచ్ అల్ట్రాను విడుదల చేయనుంది. ఈ మేరకు హైటాంగ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ అనలిస్ట్ జెఫ్ గత నెలలో మీడియాతో తెలిపారు. ప్రస్తుత వాచ్ అల్ట్రా 1.93 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. 2024 వచ్చే మోడల్ దాదాపు 10 శాతం పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. అంటే 50 మి.మీ. కంటే ఎక్కువ కేస్ పరిమాణం ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే యాపిల్ స్మార్ట్ వాచ్ అన్నింట్లోకి ఇదే పెద్ద వాచ్ అవుతుంది. అలాగే ఇందులో కొత్త అల్ట్రా మైక్రో ఎల్‌ఇడి డిస్‌ప్లే టెక్నాలజీని కూడా అందించనున్నారు. ఇది OLED డిస్‌ప్లేలతో ప్రస్తుత మోడళ్లతో పోలిస్తే అధిక బ్రైట్ నెస్, తక్కువ విద్యుత్ వినియోగం, మెరుగైన కాంట్రాస్ట్ రేషియోను అందిస్తుంది.

అయితే మైక్రో ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉత్పత్తి ఖర్చులు ప్రస్తుతం ఎక్కువగా ఉన్నందున వాచ్ తయారీకి మరింత సమయం పట్టవచ్చని అంచనా అయితే స్పెసిఫికేషన్లు అప్ గ్రేడ్ లేని కారణంగా 2023లో ఆపిల్ వాచ్ అమ్మకాలు కూడా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే ఎటువంటి పరిస్థితుల్లో అయిన వాయిస్ కాల్స్‌లో సౌండ్ క్వాలిటీని మెరుగుపరచడానికి యాపిల్‌ వాచ్‌ అల్ట్రాలో మూడు ఇంటర్నల్‌ మైక్రోఫోన్లు ఉన్నాయి. ఇది అడాప్టివ్ బీమ్‌ఫార్మింగ్ అల్గారిథమ్‌ని కూడా ఉపయోగిస్తుంది. యాంబియంట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ సౌండ్స్‌ను తగ్గించేటప్పుడు వాయిస్‌ను క్యాప్చర్ చేయడానికి మైక్రోఫోన్లను ఉపయోగిస్తుంది, దీని ద్వారా అద్భుతమైన సౌండ్ క్లారిటీ వస్తుంది. దీని ధర రూ. 90,000 వరకూ ఉండవచ్చని అంచనా వేస్తూన్నారు.