Site icon HashtagU Telugu

WhatsApp: వాట్సాప్ వినియోగదాలకు శుభవార్త.. సీక్రెట్ కోడ్ అంటూ కొత్త ఫీచర్?

Mixcollage 03 Mar 2024 03 59 Pm 2203

Mixcollage 03 Mar 2024 03 59 Pm 2203

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది. కాగా ప్రస్తుతం వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసింది వాట్సాప్ సంస్థ. తాజాగా కూడా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

మామూలుగా చాలామంది వాట్సాప్ లో తమ చాట్‌లను రహస్యంగా ఉంచాలని కోరుకుంటారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్ వెబ్ కొత్త ఫీచర్‌ను చేర్చబోతోంది. ఇది గోప్యతకు, చాట్‌ను లాక్ చేయడానికి సహాయపడుతుంది. వెబ్ వెర్షన్ కోసం వస్తున్న ఈ ఫీచర్ పేరు సీక్రెట్ కోడ్ ఫీచర్. ఇది ఇప్పటికే మొబైల్ యాప్ కోసం అందుబాటులో ఉంది. ఈ రాబోయే ఫీచర్ గురించిన సమాచారం WABetaInfo ద్వారా షేర్ చేసింది. చాట్ లాక్ ఈ ఫీచర్ వాట్సాప్ వెబ్ బీటా కోసం విడుదల చేసింది. ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఎలాంటి చాట్‌నైనా సులభంగా లాక్ చేయవచ్చు. ఇప్పటి వరకు ఈ ఫీచర్ కేవలం స్మార్ట్ ఫోన్లకే పరిమితమైంది.

అయితే ఇప్పుడు అది విస్తరించబోతోంది. సీక్రెట్ కోడ్ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ వెబ్‌లో పరీక్షిస్తోంది. అన్ని పరీక్షలను కంపైల్ చేసిన తర్వాత ఇది త్వరలో వినియోగదారులకు అందుబాటులో రానుంది. తమ ఆఫీస్ డెస్క్‌టాప్‌లో వాట్సాప్‌ను నిరంతరం ఉపయోగించే, తరచుగా లాగ్‌అవుట్ చేయడం మరచిపోయే వ్యక్తులకు ఈ ఫీచర్‌లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాట్సాప్ వెబ్ లాక్ చాట్‌లను యాక్సెస్ చేయడానికి రహస్య కోడ్‌ను నమోదు చేయాలి. వాట్సాప్‌కు ఈ ఫీచర్‌లను తీసుకురావడం ఉద్దేశ్యం వినియోగదారుల సున్నితమైన సమాచారాన్ని ఇతరుల నుండి రక్షించడం. దీని కోసం అదనపు భద్రతా పిన్‌గా ఉపయోగించుకోవచ్చు.