Site icon HashtagU Telugu

Whatsapp Update: వాట్సాప్‌ యూజర్స్ గుడ్ న్యూస్.. ఆ అలెర్ట్‌ ఫీచర్‌తో వారికీ పండగే?

Mixcollage 17 Dec 2023 09 15 Pm 1000

Mixcollage 17 Dec 2023 09 15 Pm 1000

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తున్న మెసేజ్ యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి. అంతేకాకుండా ఈ వరుసలో వాట్సాప్ ముందుగా ఉంటుందని చెప్పవచ్చు. స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వాట్సాప్ ను వినియోగిస్తూనే ఉంటారు. అయితే వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడంతో వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు మంచి మంచి ఫీచర్లను వినియోగదారులకు పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని తీసుకొస్తుంది వాట్సాప్ సంస్థ. ఒక నీవేదిక ప్రకారం వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌2.23.26.6 నవీకరణ కోసం వాట్సాప్‌ బీటాతో కొత్త ఛానెల్ హెచ్చరికల ఫీచర్‌ను పరిచయం చేసింది.

అలాగే రాబోయే రోజుల్లో వినియోగదారులందరికీ దీన్ని అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త ఫీచర్ ఛానెల్ వినియోగదారులకు వారి ఛానెల్ సస్పెన్షన్ గురించి రియల్‌ టైమ్‌ డేటాను అందించడం ద్వారా అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఛానెల్ నిర్వాహకులు వాట్సాప్‌ విధానాల ఉల్లంఘనల గురించి తెలుసుకోవడానికి ఛానెల్ హెచ్చరికల ఫీచర్‌ని ఉపయోగించవచ్చు. ఇకపోతే ఈ తాజా ఫీచర్‌ గురించి మరిన్ని వివరాల విషయానికి వస్తే.. వాట్సాప్‌ ఛానెల్ హెచ్చరికల ఫీచర్ ప్లాట్‌ఫారమ్‌కు మరింత పారదర్శకతను తీసుకువచ్చే అవకాశం ఉందని, వినియోగదారులు తమ ఛానెల్‌లతో సమస్యలను గుర్తించడానికి, వాటిని పరిష్కరించడానికి తీసుకోవలసిన చర్యలను వివరించడానికి అనుమతిస్తుంది.

అలాగే వాట్సాప్‌ రాబోయే రోజుల్లో తన ఆండ్రాప్‌ యాప్‌లో రెండు కొత్త ఫీచర్‌లను కూడా విడుదల చేస్తోంది. స్క్రీన్‌పైకి స్క్రోల్ చేస్తున్నప్పుడు నావిగేషన్ లేబుల్‌లు, టాప్ యాప్ బార్‌ను దాచడం , తేదీ వారీగా సందేశాలను శోధించే సామర్థ్యం. నావిగేషన్ లేబుల్‌లు, టాప్ యాప్ బార్‌ను దాచడం వల్ల వినియోగదారులు వారి చాట్‌లు, కాల్ లాగ్‌లు, కమ్యూనిటీ గ్రూప్ చాట్‌లు, ఛానెల్‌ల గురించి పెద్దగా వీక్షించే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే తేదీల వారీగా సందేశాలను శోధించే సామర్థ్యం చాట్ చరిత్రను బ్రౌజింగ్ చేసే ప్రక్రియను, నిర్దిష్ట సందేశాలను మరింత సమర్థవంతంగా సౌకర్యవంతంగా కనుగొనేలా చేస్తుంది. ముఖ్యంగా మెసేజింగ్ సర్వీస్ కొత్త స్టేటస్ అప్‌డేట్ ఫీచర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌తో కలిసిపోవడానికి కూడా ఆసక్తిగా ఉంది. అలాగే మరో నివేదిక ప్రకారం వాట్సాప్‌ త్వరలో దాని వినియోగదారులు వారి స్థితి నవీకరణలను నేరుగా ఇన్‌స్టాగామ్‌లో స్టోరీలుగా పంచుకోవడానికి అనుమతిస్తుంది, సిద్ధాంతపరంగా వినియోగదారులకు చాలా సమయం ఆదా అవుతుంది.