Site icon HashtagU Telugu

Google Authenticator లో కొత్త అప్ డేట్.. ఇక క్లౌడ్‌లో  OTP లు నిక్షిప్తం

New Update In Google Authenticator .. Otps Are Stored In The Cloud

New Update In Google Authenticator .. Otps Are Stored In The Cloud

Google Authenticator యాప్  మీరు వాడుతారా? అయితే ఒక కొత్త అప్ డేట్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అదేమిటంటీ.. ఇకపై ఐవొఎస్, ఆండ్రాయిడ్ రెండు వర్షన్లలోనూ మీ గూగుల్ అకౌంట్స్ కు సంబంధించిన వోటీపీ (వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు) ను సేఫ్టీ బ్యాకప్ చేసుకోవచ్చు.. యాప్ లో నిల్వ చేసుకోవచ్చు.  దీనివల్ల మీ గూగుల్  అకౌంట్స్ భద్రత మరింత పెరుగుతుంది. ఈమేరకు గూగుల్  ఒక బ్లాగ్ పోస్ట్ పెట్టింది. Google  అకౌంట్ మద్దతుతో, క్లౌడ్‌లో వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు సేవ్ చేయబడతాయని వెల్లడించింది.

కొత్త అప్ డేట్ వల్ల Google అకౌంట్ కలిగిన వారు ఒకవేళ Google Authenticator యాప్ ఇన్‌స్టాల్ చేసిన ఫోన్ ను పోగుట్టుకున్నా ప్రోబ్లం ఉండదు. అ తర్వాత వేరొక ఫోన్ ద్వారా అకౌంట్ లోకి లాగిన్ అయి .. సేఫ్టీ బ్యాకప్ అయి ఉన్న వోటీపీ (వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు) లను సులభంగా  తిరిగి పొందొచ్చు. “చాలా  సంవత్సరాలుగా వినియోగదారుల నుంచి మేము విన్న ఒక ప్రధాన అభిప్రాయం  ఏమిటంటే.. Google Authenticator ఇన్‌స్టాల్ చేసిన ఫోన్ పోయినప్పుడు తలెత్తే సంక్లిష్టత.

Authenticator యాప్ లోని వన్ టైమ్ కోడ్‌లు ఒకే పరికరంలో మాత్రమే నిల్వ చేయబడినందున, దాన్ని పోగొట్టుకున్నప్పుడు వినియోగదారులు Authenticator యాప్ ని ఉపయోగించి 2FAని సెటప్ చేసే ఏదైనా సేవకు సైన్ ఇన్ చేయగల సామర్థ్యాన్ని కోల్పోతారు. ఇకపై వన్-టైమ్  పాస్‌వర్డ్‌లు  క్లౌడ్‌లో  స్టోర్ అవుతాయి. దీనివల్ల ఎలాంటి ప్రోబ్లం ఉండదు. వినియోగదారులు లాకౌట్ నుంచి రక్షణ పొందుతారు” అని Google తెలిపింది. Google ఖాతా మద్దతును జోడించడం కోసం Google Authenticator యాప్‌లో ఖాతాకు సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది.  ఆ తర్వాత మీ ఫోన్ లోకి వచ్చే వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు ఆటో మేటిక్ గా సేవ్ అవుతాయి. క్లౌడ్‌లో నూ దాచబడతాయి.

జూన్ 27న గూగుల్ మడతపెట్టే ఫోన్ రిలీజ్:

గూగుల్ మడతపెట్టే ఫోన్ వివరాలు బయటికి వచ్చేశాయి. ఫోల్డబుల్ సెల్ ఫాన్స్ మార్కెట్ స్పేస్ లో రారాజుగా ఉన్న శామ్సంగ్ కు పోటీ ఇచ్చేందుకు గూగుల్ రెడీ అవుతోంది. ఈ ఏడాది జూన్ 27న  వినియోగదారులకు ఫోల్డబుల్ సెల్ ఫాన్ ను అందుబాటులో కి తేవాలని గూగుల్  ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు ఆన్ లైన్ లో  వైరల్ అవుతున్నాయి. గూగుల్ పిక్సల్ ఫోల్డబుల్ ఫోన్ ను మే10న జరగనున్న గూగుల్ ఐఓ ఈవెంట్ లో లాంచ్ చేయాలని ఆ కంపెనీ భావించింది. కానీ దాన్ని ఒక నెల పాటు వాయిదా వేశారు.

ఫోన్ ఫీచర్స్:

  1. దాదాపు 283 గ్రాముల బరువు ఉంటుంది.
  2. శామ్సంగ్ గేలాక్సీ జెడ్ ఫోల్డ్4 కన్నా 20గ్రాముల అధిక బరువు ఉంటుంది.
  3. పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ 5.5 అంగుళాల ఎత్తు, 3.1  అంగుళాల వెడల్పు, 0.5 అంగుళాల డెప్త్ కలిగి ఉండొచ్చు.
  4. ఈ ఫోన్ 5.8 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ ఓఎల్ఈడీ అవుటర్ డిస్ ప్లే, 7.6 అంగుళాల ఇన్నర్ డిస్ ప్లే ఉండే అవకాశం ఉంది.
  5. రెండు డిస్ ప్లేలు 120Hz రిఫ్రెష్ మెంట్ రేటుతో వస్తాయి.
  6. ఇది టెన్సర్ జీ2 చిప్ సెట్ తో వస్తుంది.
  7. ఈ ఫోన్ లో  వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉంటుందని అంచనా. ప్రైమరీ కెమెరా 48ఎంపీ, 10.8 ఎంపీ టెలిఫొటో, 10.8 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ముందు వైపు సెల్ఫీల కోసం 9.5ఎంపీ కెమెరా ఉండే అవకాశం ఉంది.
  8. దీనిలోని బ్యాటరీ 4,700 ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది.
  9. 12జీబీ/256జీబీ మోడల్ ధర 1,799 డాలర్లు  అంటే  మన కరెన్సీలో రూ. 1.47 లక్షలకు పైగా ఉంటుందని అంచనా.
  10. 12జీబీ/512జీబీ మోడల్ అబ్సిడియన్ కలర్‌లో మాత్రమే వస్తుంది. దీని ధర 1,919 డాలర్లు అంటే దాదాపు రూ. 1.57 లక్షల కన్నా ఎక్కువ ధరకు అందుబాటులో ఉంటుందని అంచనా.

Also Read:  Tea Tips: టీ అతిగా తాగితే ఇబ్బందా? టీ తాగడానికి లిమిట్ ఉందా?