WhatsApp: వాట్సాప్ లో మరో సరికొత్త ఫీచర్.. ఇకపై వాట్సాప్ లో అవి కనిపించవు?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేసిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - April 10, 2023 / 12:19 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది వాట్సాప్ సంస్థ. ఈ మధ్యకాలంలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఫీచర్లను పరిచయం చేస్తూ వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది ఇలా ఉంటే తాజాగా వాట్సాప్ సంస్థ మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై వాట్సాప్ నావిగేషన్ బార్ కింద కనిపించనుంది. ఈ మేరకు వాబీటా ఇన్ ఫో ఒక రిపోర్టును ప్రచురించింది.

వాట్సాప్ కనిపించే తీరులో మార్పు రానుంది. వాట్సాప్ ఓపెన్ చేయగానే మనకు పైన నావిగేషన్ బార్ లో చాట్, కాల్, స్టేటస్, కమ్యూనిటీ ట్యాబ్ లు మనకు కనిపిస్తాయి. దీనినే ఇప్పుడు మార్చడానికి యాప్ డెవలపర్స్ ప్రయత్నిస్తున్నారు. ఐఓఎస్ వెర్షన్ లో ఇదే నావిగేషన్ బార్ వాట్సాప్ కింది భాగంలో ఉంటుంది. ఇదే విధంగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా నావిగేషన్ బార్ ని కిందకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. ఈ విధంగా మార్చాలని వినియోగదారులు చాలా కాలంగా కోరుతున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు ఈ మార్పును తీసుకురానున్నారు.
అయితే ఈ కొత్త అప్ డేట్ త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

త్వరలో పూర్తి స్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. పెద్ద ఫోన్‌లను కలిగి ఉన్న వినియోగదారులను ఒక చేతిని ఉపయోగించి వివిధ ట్యాబ్‌లను నావిగేట్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ అప్ డేట్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాక వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ ఫో నివేదిక వెల్లడించింది.