ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ నిత్యం వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకర్షించడం కోసం కొత్త కొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువస్తూ వాట్సాప్ వినియోగదారుల సంఖ్యను అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ సంస్థ వినియోగదారుల కోసం మరో ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అదేమిటంటే వీడియో మోడ్ ఆప్షన్. ఈ ఆప్షన్ ద్వారా ఇతరులకు యాప్ నుంచే సులభంగా వీడియో తీసి పంపవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
ఇకపోతే ఈ ఫీచర్ గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. కాగా వాట్సాప్ వినియోగదారుడు ఏదైనా వీడియో రికార్డ్ చేయాలంటే ట్యాప్ అండ్ హోల్డ్ బటన్ వినియోగించేవారు. అయితే ఇప్పుడు దీనిని వాట్సాప్ పూర్తిగా అప్ డేట్ చేసి కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది వాట్సాప్ సంస్థ. ట్యాప్ అండ్ హోల్డ్ స్థానంలో ప్రత్యేకంగా వీడియో మోడ్ ను ఆవిష్కరించింది. ఇందుకోసం కొన్ని బగ్ లను యాప్లో ఫిక్స్ చేసింది. దాని ద్వారా వాట్సాప్ కాల్ నుంచి వీడియో మోడ్ కు ఎలా స్విచ్ అవుతున్నారో ఫోటో నుంచి వీడియో కి ఇలా స్విచ్ అయ్యే వెసులుబాటు కలుగుతోంది. మరి ఈ ఫీచర్ ఎలా పొందాలి అన్న విషయానికి వస్తే..
ఈ కొత్త ఫీచర్ ను పొందుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి మీ వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ 2.23.2.73 అప్ డేట్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. మీరు ఈ ఫీచర్ ను వినియోగించుకోవాలంటే ప్లే స్టోర్ కి వెళ్లి అప్ డేట్ చేసుకోవాల్సిందే మరి. అయితే ఈ ఏడాది మొదలై కనీసం రెండు నెలలు కూడా కాకముందే అప్పుడే దాదాపుగా అధిక పైగా ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్లతో పాటు మరికొన్ని ఫీచర్లను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది.