Top 5 SUV’s In 2023-24: త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్న ఎస్ యూవీ లు ఇవే.. ఫీచర్స్ మాములుగా లేవుగా?

భారతదేశంలో రోజురోజుకీ వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఆయా కంపెనీలు కొత్త కొత్త

  • Written By:
  • Publish Date - February 9, 2023 / 07:30 AM IST

భారతదేశంలో రోజురోజుకీ వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఆయా కంపెనీలు కొత్త కొత్త మోడల్ కలిగిన స్మార్ట్ ఫోన్ లో మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా మధ్యతరగతి వారికీ అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలకు వాహనాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఎస్ యూవీలను మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. వినియోగదారులు కూడా ఏ కంపెనీ ఏ మోడల్స్ ఎస్ యూవీలను రిలీజ్ చేస్తాయో? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి 2023 – 24 సంవత్సరంలో మార్కెట్ లోకి రాబోయే టాప్ ఎస్ యూవీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కియా సెల్టోస్‌.. భారతదేశంలో బాగా ఆదరణ పొందిన కియా సంస్థ 2023 నాటికి దేశంలో కొత్త కియా సెల్టోస్‌ ను విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అయితే ఇప్పటికే ఈ కియా సెల్టోస్‌ కార్ ను పరీక్షిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ కార్ అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి సిద్ధంగా కూడా సిద్ధంగాఉంది. కొత్త మోడల్ కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు డిజైన్ లో పలు మార్పులు చేశారు. అలాగే ఇంటీరియర్‌ను అప్‌గ్రేడ్ చేశారు. క్యాబిన్ లోపల మెరుగైన ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, కొత్త ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కలిగి ఉంటుంది. అలాగే అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ అసిస్ట్ మొదలైన ఫీచర్లతో వస్తుంది. 1.5-లీటర్ 4-సిలిండర్ టర్బో ఇంజిన్ ఈ కారు ప్రత్యేకత. హ్యుందాయ్ కొట్రా కారు.. ఈ కారు 2024లో భారత్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కొత్త పారామెట్రిక్ గ్రిల్, హెడ్‌ల్యాంప్‌లు, విశాలమైన ఎయిర్ ఇన్‌లెట్ ఉన్నాయి. వెనుకవైపు టెయిల్ లైట్లు, స్లైటింగ్ ట్వీక్డ్ బూట్ లిడ్, రివైజ్డ్ బంపర్‌ తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇది 158bhp, 260Nm టార్క్ ఉత్పత్తి చేసే కొత్త 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ తో అందుబాటులో ఉండనుంది. మరో కారు హోండా ఎస్ యూవీ..

ఈ కారు 2023 మధ్య నాటికి దేశంలో సరికొత్త మధ్యతరహా ఎస్ యూవీ ని విడుదల చేయనున్నట్టు హోండా ప్రకటించింది. కొత్త మోడల్ 2023 ఏప్రిల్, మే లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేస్తున్నట్టు వెల్లడించింది. 10.2 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది 1.5 లీటర్ ఐవీ టెక్ పెట్రోల్, 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్‌తో వస్తుంది. రెనాల్డ్ డస్టర్.. ఈ కారు 2024 – 25 నాటికి కొత్త తరం డస్టర్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేయనున్నట్లు రెనాల్ట్ ప్రకటించింది. పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సన్‌రూఫ్ తో పాటు ఇతర ఆధునిక ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. కొత్త డస్టర్‌ను 48 వీ హైబ్రిడ్ టెక్‌తో 1.2L టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుందని అంచనా. అదేవిధంగా టాటా మోటార్స్ కారు 2023 ఆటో ఎక్స్‌పోలో పెట్రోల్ ఇంజన్ ఎంపికతో కర్వ్ ఎస్ యూవీ కూపే కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. ఇది టాటా కొత్త జెన్ 2 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రాథమికంగా భారీగా సవరించబడిన ఆల్ఫా ప్లాట్‌ఫారమ్. కొత్త మోడల్ పెట్రోల్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో వచ్చే అవకాశం ఉంది. ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న మోడల్ 2024లో ప్రవేశపెడతామని కంపెనీ ధ్రువీకరించింది. 1.2L 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ కార్ 5,000 ఆర్పీఎం వద్ద 125 పీఎస్ శక్తిని, 1700-3500 ఆర్పీఎం మధ్య 225 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ తో పాటు డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో వస్తుందని అంచనా.