Site icon HashtagU Telugu

Realme 11 5G: మార్కెట్లోకి మరో రియల్ మీ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

Realme 11 5g

Realme 11 5g

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్ లతో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రియల్‌మీ సంస్థ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. తాజాగా రియల్‌ మీ కంపెనీ మరో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. రియల్‌ మీ ఆగస్ట్ 23న రియల్‌ మీ 11 5 జీ, రియల్‌ మీ 11 ఎక్స్‌ 5 జీ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ స్మార్ట్‌ ఫోన్‌లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. నివేదికల ప్రకారం రియల్‌ 11 5 జీ ధర సుమారు రూ.20,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే రియల్‌ మీ 11 ఎక్స్‌ ఫోన్‌పై ధర అంశంలో ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు. కానీ ఈ ఫోన్‌ కూడా ఇతర 5జీ ఫోన్లతో పోల్చుకుంటే మరింత తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన మరిన్ని వివరాల విషయానికి వస్తే.. రియల్‌ మీ 11 5 జీ 3 ఎక్స్‌ జూమ్‌తో 108 ఎంపీ కెమెరా, 67 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండనుంది. అంటే ఈ సూపర్‌ఫాస్ట్‌ చార్జ్‌ ద్వారా కేవలం 17 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను 0 శాతం నుంచి 50 శాతానికి పెంచుతుందని కంపెనీ పేర్కొంది. అలాగే ఈ ఫోన్‌ రెండు ర్యామ్ స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

8 జీబీ + 128 జీబీతో పాటు 8 జీబీ 256 జీబీ వేరియంట్‌లో ఈ ఫోన్‌ వినియోగదారులను పలుకరించనుంది. ఈ ఫోన్‌ గ్లోరీ హాలో డిజైన్‌తో నలుపు, బంగారపు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. రియల్‌ మీ 11 5జీ జీ ప్రపంచంలోని మొట్టమొదటి 5జీ తక్కువ-పవర్ హాట్‌స్పాట్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. అంటే పరికరం తక్కువ-పవర్ మోడ్‌లో ఉన్నప్పుడు కూడా వినియోగదారులు వేగవంతమైన 5 జీ హాట్‌స్పాట్‌కు కనెక్ట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే రియల్‌మీ 11 ఎక్స్‌ 5జీ 64 ఎంపీ ఏఐ కెమెరాతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో కూడిన సరసమైన వెర్షన్గా నిలువనుంచి ఈ ఫోన్‌ రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 6 జీబీ 128 జీబీ, 8 జీబీ + 256 జీబీ వేరియంట్స్‌లో వినియోగదారులను పలుకరించే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ ఎస్‌-కర్వ్ డిజైన్‌తో పర్పుల్, గోల్డ్ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌ చైనాలో మే నెలలోనే ఆవిష్కరించారు.