Realme 13 Pro 5G: అలాంటి సరికొత్త ఫీచర్ తో మార్కెట్ లోకి రాబోతున్న రియల్ మీ స్మార్ట్ ఫోన్?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది.

  • Written By:
  • Publish Date - July 22, 2024 / 11:00 AM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ ఇప్పటికే భారత మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. కొత్త కొత్త ఫోన్ల లను విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు సరికొత్త ఫీచర్ తో ఇప్పుడు మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదల కానుంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది.

రియల్‌మీ 13 ప్రో పేరుతో ఈ నెల 30వ తేదీన ఈ ఫోన్‌ ను లాంచ్‌ చేయనున్నారు. రియల్‌మీ 13 ప్రోతో పాటు, రియల్‌మీ 13 ప్రో+ ఫోన్‌ లను విడుదల చేయనున్నారు. కాగా కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌ లో సోనీ ఎల్‌వైటీ 600 లెన్స్‌ ను ఇస్తున్నారు. ప్రపంచంలో ఈ ఫీచర్‌ తో వస్తున్న మొట్ట మొదటి ఫోన్‌ కూడా ఇదేనని కంపెనీ పేర్కొంది. ఇకపోతే ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందిస్తున్నారు. అలాగే 1080×2412 పిక్సల్స్ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 2.4 గిగా హెర్ట్జ్ ఒక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఈ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్‌, 1 టిగా బైట్‌ స్టోరేజ్‌ ఇవ్వనున్నారు. రియల్‌ మీ నుంచి వస్తున్న తొలి ప్రొఫెషనల్‌ ఫోన్‌ ఇదే. హైపర్ ఇమేజ్+ ఫోటోగ్రఫీ ఆర్కిటెక్చర్‌ను అందించనున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే.. ఇందులో ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ ను అందించనున్నారు. అలాగే ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా,2 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాను అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కూడా కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‫ను ఇవ్వనున్నారు. ఇకపోతే బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్ 5050 ఎంఎహెచ్ కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ రియల్ మీ 13 ప్రో+, రియల్ మీ 13 ప్రో ఫోన్లు మోనెట్ గోల్డ్, మోనెట్ పర్పుల్ వంటి కలర్స్‌లో తీసుకొస్తున్నారు.

Follow us