Site icon HashtagU Telugu

OPPO Phones : ఒప్పో నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. ఒప్పో రెనో 10 5G

New Phones Launching From Oppo Brand Oppo Reno 10 with 5G Model

New Phones Launching From Oppo Brand Oppo Reno 10 with 5G Model

భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఒప్పో నుంచి సరికొత్త సిరీస్ లాంచ్ అయింది. అదే ఒప్పో రెనో 10 5G (Oppo Reno 10 5G). ఈ సిరీస్ లో భాగంగా మొత్తం మూడు స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటితో పాటు కొత్త ఇయర్ బడ్స్ ను సైతం కంపెనీ తీసుకొచ్చింది. ఒప్పో రెనో 10 5G(Oppo Reno 10 5G), ఒప్పో రెనో 10 ప్రో(Oppo Reno 10 pro). ఒప్పో రెనో ప్రో ప్లస్ 5G(Oppo Reno 10 pro+5G) స్మార్ట్ ఫోన్ లు ఈ రోజు లాంచ్ అయ్యాయి.

ఒప్పో రెనో10 సిరీస్ ఫీచర్స్ :

ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ 5G ఫోన్ ధరను రూ. 54,999గా కంపెనీ నిర్ణయించింది. ఇది 12 జీబీ +256 జీబీ వేరియంట్లో వస్తోంది. రెనో 10 ప్రో 12 జీబీ +256 జీబీ ధర రూ. 39,999 కాగా ఇది గ్లాస్ పర్పుల్, సిల్వర్ గ్రే రంగులో ఉండనుంది. ప్రో, ప్రో ప్లస్ మోడళ్లు జూలై 13 నుంచి అమ్మకానికి రానున్నాయి. ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్‌లతో పాటు ప్రధాన రిటైల్ స్టోర్ లలో కూడా ఈ ఫోన్లు లభించునున్నాయి. ఇక ఒప్పో రేనో 10 5G ధర ఈ నెల 20న వెల్లడించనున్నారు. ఇది ఐస్ బ్లూ, సిల్వర్ గ్రే కలర్స్ లో లభించునుంది.

ఒప్పో రెనో 10 ప్రో+5G ఆండ్రాయిడ్ 13 ఆధారిత కలర్ ఓఎస్ 13.1తో వస్తోంది. 6.74 అంగుళాల అమోలెడ్ 3డీ కర్వడ్ డిస్ప్లే ఉంది. 120 డైనమిక్ రిఫ్రెష్ రేటుతో కూడిన డిస్ప్లే తో వచ్చే ఈ ఫోన్ ఆక్టాకోర్ స్నాప్ గన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ తో పనిచేస్తుంది.

ఇక ఒప్పో రెనో 10 ప్రో 5Gలో 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ + ఓఎల్ఈడీ 3డీ కర్వడ్ డిస్ప్లే ఉంది. దీని రిఫ్రెష్ రేటు 120 కాగా 8జీబీ వరకు వర్చువల్ ర్యామ్ వినియోగించుకోవచ్చు. ఇందులో 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 890 ప్రధాన కెమెరా ఇచ్చారు. ఒప్పో రెనో 10 5Gలో కూడా రెనో 10 ప్రోలో ఉన్న సాఫ్ట్‌వేర్, డిస్ప్లే స్పెసిఫికేషన్సే ఉన్నాయి.

ఈ 3 ఫోన్లో తో పాటు ఎయిర్ 3 ప్రో ఇయర్ బర్డ్స్ ను ఒప్పో లాంచ్ చేసింది. వీటి ధర రూ. 4,999గా నిర్ణయించింది. ఇవి జూలై 11 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఆన్లైన్ స్టోర్ లతోపాటు రిటైల్ స్టోర్ లలో కూడా లభ్యం కానున్నాయి.