WhatsApp: వాట్సాప్ డెస్క్ టాప్ లో సరికొత్త ఫీచర్స్.. అవేంటో తెలిస్తే వావ్ అనాల్సిందే!

ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది

  • Written By:
  • Publish Date - March 23, 2023 / 09:55 PM IST

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ సంస్థ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా అందుకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. ఇదిలా ఉంటే వాట్సాప్‌ నిత్యజీవితంలో భాగమైన తర్వాత మొబైల్ లో వాడే వారితో పాటు ఆఫీస్ విషయాలలో దీనిని వాడే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. డెస్క్‌టాప్‌ యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్‌ తన డెస్క్‌టాప్‌ యాప్‌ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.

ఇక ఇందులో భాగంగానే కొత్త విండోస్‌ డెస్క్‌టాప్‌ యాప్‌ను వాట్సాప్‌ మాతృ సంస్థ మెటా తీసుకొచ్చింది. కాగా వాట్సాప్‌ సంస్థ తీసుకొచ్చిన ఈ కొత్త యాప్‌ను మైక్రోసాఫ్ట్‌ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొత్త డెస్క్‌టాప్‌ యాప్‌ వేగంగా లోడ్‌ అవ్వడమే కాకుండా ఇంటర్‌ ఫేస్‌లో కూడా మార్పులు చేసింది. అలాగే ఇక పై వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ యాప్‌ ద్వారా ఒకేసారి 8 మందితో వీడియో కాల్స్ లో మాట్లాడవచ్చు. అలాగే 32 మంది తో గ్రూప్‌ ఆడియో కాల్స్‌ మాట్లాడవచ్చు.
మరోవైపు వాట్సాప్‌లో లింక్‌ డివైజ్‌ను ఫీచర్‌ను సైతం మెటా మరింత మెరుగుపరిచింది.

ఒకప్పుడు వాట్సాప్‌ను డెస్క్‌టాప్‌లో వాడాలంటే మొబైల్‌తో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాల్సి వచ్చింది. ఇంటర్నెట్‌ తప్పనిసరిగా ఆన్‌లో ఉంచాల్సి ఉండేది. లింక్‌ డివైజ్‌ ఫీచర్‌ తీసుకొచ్చిన తర్వాత మొబైల్‌ డేటా ఆఫ్‌లో ఉన్నా వాట్సాప్‌ను వినియోగించుకునే అవకాశాన్ని వాట్సాప్‌ సంస్థ అందుబాటులోకీ తీసుకొచ్చింది. ఇలా ఒకేసారి వాట్సాప్ ను నాలుగు డివైజ్‌లకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. డివైజ్‌ను వేగంగా లింక్‌ చేసుకోవడంతో పాటు వేగంగా సింక్‌ చేసుకోవచ్చు.