Site icon HashtagU Telugu

IRCTC: ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌లో కొత్త ఫీచర్స్..అవేంటంటే..!

Irctcrailconnectbooktrainticketatyourfingertips 23 1495530232 Imresizer

Irctcrailconnectbooktrainticketatyourfingertips 23 1495530232 Imresizer

IRCTC App: IRCTCకి, భారతీయ రైల్వే ప్రయాణీకులకు మధ్య విడదీయలేని బంధం ఉంటుంది. ఒకప్పుడు ట్రైయిన్ టికెట్స్ బుక్ చేయాలంటే రైల్వే స్టేషన్ల ముందు క్యూలో నిలబడాల్సి వచ్చేది. కానీ ఐఆర్ సీటీసి ఆన్ లైన్ టికెటింగ్ ఫ్లాట్ ఫాంను ఏర్పాటు చేయడంతో రైలు టికెట్ల బుకింగ్ ఈజీగా మారింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌లో ఈజీగా రైలు టికెట్లు బుక్ చేయొచ్చు. అయితే IRCTC రైల్ కనెక్ట్ యాప్ లో అనేక కొత్త ఫీచర్లు వచ్చాయి. వాటిని వినియోగించుకోవాలని ఐఆర్ సిటీసీ కోరుతోంది. ప్రధాన ఫీచర్ల వివరాలను ట్వీట్ చేసింది. లాగిన్ చేయాల్సిన అవసరంలేకుండానే రైళ్ల వివరాలను తెలుసుకోవచ్చు. అంధుల కోసం గూగుల్ టాక్ బ్యాన్ ఫీచర్ మరియు మర్చిపోయిన యూజర్ ఐడీని ఈజీగా రికవరీ చేసుకోవడం, బోర్డింగ్ పాయింట్ ను మార్చుకోవడం, స్మార్ట్ ఫోన్ ద్వారా ఆధార్ నెంబర్ లింక్ చేయడం వంటి ప్రధాన ఫీచర్లను అందుబాటులోకి వచ్చాయని ఐఆర్ సిటిసీ వెల్లడించింది.

ఇక ఈ ఐటీఆర్ సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫ్లాట్ ఫాంలో అందుబాటులో ఉంది. ప్రయాణికులు స్మార్ట్ ఫోన్ తో సులవుగా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ మద్యే మరిన్ని తాజా ఫీచర్స్ ను అందుబాటులోకి తెచ్చింది. కొత్త వినియోగదారులు యాప్ నుంచే డైరెక్టుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ మొత్తం రెండు పేజీల్లోఉంటుంది. ప్రతీసారి యూజర్ నేమ్ పాస్ వర్డ్ నమోదు చేయాల్సిన పనిలేకుండా ఓ పిన్ క్రియేట్ చేసుకోవాలి. ఆ పిన్ సాయంతోనే లాగిన్ కావొచ్చు.

వీటితోపాటు ఇంటిగ్రేటెడ్ మెనూబార్ తో డ్యాష్ బోర్డును కూడా అందుబాటులోకి తెచ్చింది. డ్యాష్ బోర్డు నుంచే అకౌంట్, ట్రాన్స్ జక్షన్స్ జరుపుకోవచ్చు. రైళ్ల గురించి, రూట్ గురించి, సీట్ల లభ్యత వంటి వివరాలను సులువుగా తెలుసుకోవచ్చు. లాగిన్ అవసరం లేకుండానే రైళ్లగురించి తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది IRCTC. పీఎన్ ఆర్ రిజర్వేషన్ స్టేటస్ గురించి తెలుసుకోవడానికి పీఎన్ ఆర్ ఎంక్వైరీ ఫీచర్ ను కూడా ఉపయోగించుకోవచ్చు.

ఇక టికెట్స్ వెయిటింగ్ లిస్టులోఉన్నట్లయితే తమ టికెట్స్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఎంత శాతం ఉందో కూడా తెలుసుకోవచ్చు. జనరల్ కోటా టికెట్లతోపాటు లేడిస్, తత్కాల్, ప్రీమియం, దివ్యాంగులు, లోయర్ బెర్త్, వంటి కోటాల్లో రైలు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దివ్యాంగుల కోసం భారతీయ రైల్వే జారీ చేసిన ఐడీ కార్డును ఉపయోగించి కన్సెషనల్ ధరలకే టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

ఇక రైలు టికెట్లన అంధులు బుక్ చేసుకునేందుకు కొత్తగా గూగుల్ టాక్ బ్యాన్ ఫీచర్ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చు. IRCTC రైల్ కనెక్ట్ యాప్ లో మాస్టర్ ప్యాసింజర్ లిస్ట్ ఫీచర్ కూడా ఉంది. ఇందులో తరచుగా ప్రయాణించే ఫ్యామిలీ మెంబర్స్ పేర్లను కూడా యాడ్ చేసుకోవచ్చు.

Exit mobile version