Instagram : ఇన్‌స్టాగ్రామ్ డైలీ లిమిట్ ఫీచర్‌లో అప్ డేట్స్..!!

ఇన్ స్టాగ్రామ్...ఈ యాప్ కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు.

  • Written By:
  • Publish Date - February 24, 2022 / 12:01 PM IST

ఇన్ స్టాగ్రామ్…ఈ యాప్ కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. సెలబ్రిటీలు ఎక్కువగా ఇన్ స్టానే ఫాలో అవుతారు. మిగతా యాప్స్ తో పోల్చితే ఇన్ స్టాగ్రాం వినియోగించడం చాలా ఈజీ. దీంతో ఎక్కువ మంది ఇన్ స్టా వైపే మొగ్గుచూపుతున్నారు. అంతేకాదు యూజర్ల టేస్టుకు తగ్గట్లుగా ఇన్ స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు ఫీచర్లను అప్ డేట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. లేటెస్టు ఫీచర్లను అందిస్తూ….సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతోంది. ఇప్పుడు కొన్ని ఫీచర్లలో మార్పులు చేర్పులు చేసింది. అవేంటో తెలుసుకుందాం.

తాజాగా డైలి లిమిట్ ఫీచర్ లో మార్పులు చేసింది ఇన్ స్టాగ్రామ్. యూజర్లు కనీసం పది నుంచి 30 నిమిషాల వరకు సమయాన్ని గడిపేలా యాప్ లో మార్పులు తీసుకువచ్చినట్లు ఇన్ స్టా తెలిపింది. ఫోటో, వీడియో షేరింగ్ అప్లికేషన్ పేరుతో 2018లో యువర్ యాక్టివిటీ ఫీచర్ను కూడా ప్రవేశపెట్టింది. అయితే యూజర్లు యాప్ లో ఎంత సమయం కేటాయిస్తున్నారో…ట్రాక్ చేసేందుకు ప్రస్తుతం ఉన్న పది నుంచి పదిహేను నిమిషాల చెక్ బాక్స్ ను డిలీట్ చేసి…30 నిమిషాలు మినిమం లిమిట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇదే కాదు టేక్ ఎ బ్రేక్ అనే ఫీచర్ ను కూడా రిలీజ్ చేసిన కొద్దిరోజుల్లోనే ఈ కొత్త డెవలప్ మెంట్ అమల్లోకి వస్తుంది. దీంతో యాప్ లో ఎక్కువ సమయం గడుపుతున్నప్పుడు మధ్యలో బ్రేక్ తీసుకునేందుకు యూజర్లకు అనుమతి ఉంటుంది.

ఇక ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు రోజువారీ టైం లిమిట్ 30 నిమిషాల నుంచి 45 నిమిషాలు…గంట, రెండు గంటలు ఇలా ఒకరోజులో మొత్తం మూడు గంటల వరకు ఉంటుంది. అయితే ఇంతకు ముందున్న యాప్ లో రోజువారీ యాక్సెస్ ను పరిమితం చేయడానికి యూజర్లు పది నుంచి పదిహేను నిమిషాల టైమ్ లిమిట్ ను సెలక్ట్ చేసుకునేందుకు అనుమతి ఉండేది.కాగా ఇన్ స్టా ఫీడ్ లో మీద కనిపించే పాప్ అప్ ద్వారా లెటెస్ట్ డెవలప్ మెంట్ గురించి అలర్ట్ చేస్తుంది. అంతేకాదు రోజువారీ టైమ్ లిమిట్ ఆప్షన్ను అప్ డేట్ చేయమని కోరుతుంది. మోటాకు సంబంధించి 2021, 4వ క్వార్టర్ లో వచ్చిన లాభాల ప్రకటన తర్వాత నుంచి సెట్టింగ్స్ లో కొత్త మార్పులను చేశారు. ఒకే సమయంలో ఎక్కువ నోటిఫికేషన్స్ పంపించేందుకు, లేదా డిలీట్ చేసేందుకు డైలీ లిమిట్ అనే ఆప్షన్స్ మార్చినట్లు ఇన్ స్టాగ్రామ్ ఈ మేరకు ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేసింది.

టేక్ ఎ బ్రేక్ ఫీచర్ తో యూజర్లు యాప్ నుంచి బయటకు వచ్చేందుకు పూర్తి స్క్రీన్ రిమైండర్స్ ను పొందే ఛాన్స్ ఉంటుంది. గరిష్టంగా పది నిమిషాల విరామం కూడా తీసుకోవచ్చు. దీన్ని మరో అర్ద గంట వరకు పొడించుకునే ఛాన్స్ ఉంటుంది. సోషల్ మీడియాలో యూజర్లు ఎలా వ్యవహారిస్తున్నారన్న దానిపై మరింత కంట్రోల్ ఉండటం కోసమే ఈ ఫీచర్ ప్రధాన లక్ష్యమని ఇన్ స్టా తెలిపింది. ఇన్ స్టాలోని స్క్రోలింగ్ ద్వారా విరామం తీసుకునేందుకు రిమైండ్స్ ను సెట్ చేయడానికి  ఈ ఫీచర్ను వినియోగించుకోవచ్చు.