ప్రస్తుత రోజుల్లో ట్రాఫిక్ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని కొన్ని సార్లు ఈ ట్రాఫిక్ లో అంతరాయాలు ఏర్పడి గంటల తరబడి అలాగే నిలబడాల్సి వస్తూ ఉంటుంది. దీంతో చాలామంది గూగుల్ మ్యాప్స్ నీ వినియోగించి షార్ట్ కట్స్ రూట్లో వెళ్లిపోతూ ఉంటారు. అలాగే ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా గూగుల్ మ్యాప్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు.
oదీనికి తోడు వాయు కాలుష్యం ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే. ఈ వాయు కాలుష్యం కారణంగా ప్రతి ఏడాది పదుల సంఖ్యలో మనుషులు చనిపోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రదేశాలలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. అయితే ఈ వాయు కాలుష్యాన్ని గుర్తించడం కోసం తాజాగా గూగుల్ మ్యాప్స్ సంస్థ ఎయిర్ వ్యూ అనే ఒక కొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ వారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 491 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో గూగుల్ ఈ ఎయిర్ వ్యూ అనే ఫీచర్ ను తీసుకువచ్చింది.
దీని ద్వారా ఆయా నగరాల అధికారులకు గాలి నాణ్యత శాతం ఎప్పటికప్పుడు తెలుస్తుంది. దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం సాగించవచ్చట. ఏఐ ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుందట. గాలి నాణ్యతను తెలుసుకోవడానికి ఉపయోగించే కొలమానాన్నే ఏక్యూఐ అని చెప్పవచ్చు. దీని ద్వారా ఆయా ప్రాంతాలలో గాలి పీల్చడం వల్ల కలిగే ప్రమాదాల నుంచి దూరంగా ఉండవచ్చు. ఏక్యూఐ అనేది 0 నుంచి 500 మధ్య ఉంటుంది. దీనిలో 0 నుంచి 50 పాయింట్ల మధ్య గాలి నాణ్యత ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. 51 నుంచి 100 పాయింట్ల మధ్య ఉంటే సమూహాలలో శ్వాస తీసుకోవడానికి అవస్థలు కలుగుతాయి.
101 నుంచి 200 వరకూ ఉంటే పిల్లలు, ముసలివారితో పాటు ఊపిరితిత్తులు, గుండె సంబంధ వ్యాధులతో బాధపడేవారికి అసౌకర్యంగా ఉంటుంది. 201 నుంచి 400 వరకూ ఉన్న నగరాలలో అనేక ఇబ్బందులు కలుగుతాయి. 401 నుంచి 500 మధ్య ఉండే ఆరోగ్య వంతులపై కూడా దుష్ప్రభావం చూపుతుంది. ఇటీవల ఢిల్లీలో 491 పాయింట్ల నమోదు కావడం అక్కడ వాయ కాలుష్యాన్ని తెలియజేస్తుంది. దీంతో వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఈ సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చారు. ఈ సరికొత్త ఫ్యూచర్ ద్వారా వాహన వినియోగదారులు ముందుగానే వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.