వాట్సాప్ (Whatsapp ) యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. తాజాగా ‘గెస్ట్ చాట్’ (Guest chat) అనే కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ అకౌంట్ లేని వారితో కూడా చాట్ చేయవచ్చు. అంటే, మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు లేదా సహోద్యోగులకు వాట్సాప్ అకౌంట్ లేకపోయినా, వారితో టెక్స్ట్ మెసేజ్ల ద్వారా మాట్లాడవచ్చు. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్ దశలో ఉంది.
MLAs : ఎమ్మెల్యేల పనితీరుపై త్వరలో చంద్రబాబు రివ్యూ
ఈ ఫీచర్ను ఉపయోగించుకోవాలంటే, ముందుగా మీరు ఎవరితో చాట్ చేయాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్ నంబర్కు ఒక ఇన్విటేషన్ లింక్ పంపాలి. ఈ లింక్ను మీరు టెక్స్ట్ మెసేజ్, ఈమెయిల్ లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా పంపవచ్చు. అవతలి వ్యక్తి ఆ లింక్పై క్లిక్ చేసి చాట్లోకి ప్రవేశించవచ్చు. అయితే, ఈ గెస్ట్ చాట్ ఫీచర్లో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ చాట్ ద్వారా మీడియా ఫైల్స్ (ఫోటోలు, వీడియోలు), ఆడియో/వీడియో కాల్స్ పంపేందుకు వీలుండదు. కేవలం టెక్స్ట్ మెసేజ్లు మాత్రమే పంపగలం.
BCCI: టీమిండియా ఆటగాళ్లకు భారీ షాక్ ఇవ్వనున్న బీసీసీఐ?!
ఈ ‘గెస్ట్ చాట్’ ఫీచర్ వాట్సాప్ యూజర్లకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే, వాట్సాప్ లేని వారితో ముఖ్యమైన విషయాలను వెంటనే పంచుకోవడానికి ఇది తోడ్పడుతుంది. ముఖ్యంగా, తక్కువ మంది యూజర్లు ఉన్న గ్రూప్లలో వాట్సాప్ లేని వ్యక్తులను కూడా ఇందులో చేర్చవచ్చు. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. వాట్సాప్ ఈ ఫీచర్పై మరింత సమాచారం విడుదల చేసే అవకాశం ఉంది.