WhatsApp: వాట్సాప్ లో అదిరిఫోన్ ఫీచర్స్.. ఒక్కో కాంటాక్ట్ కి ఒక్కోరింగ్ టోన్?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి

  • Written By:
  • Publish Date - January 23, 2023 / 07:00 AM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ప్రైవసి, స్టేటస్, ప్రొఫైల్, చాట్ విషయంలో కొత్త కొత్త ఫీచర్స్ ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో సరికొత్త ఫీచర్ ని వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే వాట్సాప్ రింగ్ టోన్ ఫీచర్. వాట్సాప్ లో ప్రతి కాంటాక్ట్ కి, అలాగే ప్రతి గ్రూప్ ప్రత్యేకంగా రింగ్ టోన్ పెట్టుకొనే వెసులుబాటు వాట్సాప్ లో ఉంది.

ఆ ఫీచర్ ఏమిటి? ఎలా పనిచేస్తుంది?అన్న విషయానికి వస్తే.. ఇందుకోసం మీరు ఎవరి కాంటాక్ట్ కి అయితే సెట్ చేయాలి అనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ ను సెలెక్ట్ చేయండి. ఆ కాంటాక్ట్ క్లిక్ చేసి,ప్రోఫైల్ లో కింద కనిపించే కస్టమ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. యూజ్ కస్టమ్ నోటిఫికేషన్ ను క్లిక్ చేసి, కింద వచ్చే మెనూ నుంచి రింగ్ టోన్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఇష్టమైన రింగ్ టోన్ ని ఎంపిక చేసుకోవాలి. మీరు ప్రత్యేక రింగ్ టోన్ పెట్టాలనుకుంటున్న వ్యక్తిని మీ కాన్వర్జేషన్స్ నుంచి సెలెక్ట్ చేసుకొని, వారి పేరుపై క్లిక్ చేయాలి. కింద మెనూ నుంచి వాల్‌పేపర్ & సౌండ్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి. దాని కింద కస్టమ్ టోన్ బటన్ క్లిక్ చేసి, అలర్ట్ టోన్ లోకి వెళ్లి మీకు ఇష్టమైన రింగ్ టోన్ ను సెట్ చేసుకోవాలి.

గ్రూప్ లకు రింగ్ టోన్ సెట్ చేయాలంటే, మీ చాట్స్ లో నుంచి ప్రత్యేక రింగ్ టోన్ పెట్టాలనుకుంటున్న గ్రూప్ ను ఎంపిక చేసుకొని, దాని పేరుపై క్లిక్ చేయాలి. ఆ గ్రూప్ ప్రోఫైల్ లో కింద కనిపించే కస్టమ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకొని తరువాత యూజ్ కస్టమ్ నోటిఫికేషన్ ను క్లిక్ చేసి, కింద వచ్చే మెనూ నుంచి రింగ్ టోన్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి ఆ తర్వాత మీ ఇష్టాన్ని బట్టి రింగ్ టోన్ ని సెట్ చేసుకోవాలి. అయితే ఐఫోన్ వినియోగదారులకు మాత్రం గ్రూప్ లకు రింగ్ టోన్ సెట్ చేసుకొనే అవకాశం లేదు. ప్రీ సెట్ టోన్ వస్తుంది.