Telegram : టెలిగ్రామ్ లోకి కొత్త ఫీచర్..

దేశీయ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్...కొత్త కొత్త ఫీచర్స్ తో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ను జోడిస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

  • Written By:
  • Publish Date - February 1, 2022 / 12:16 PM IST

దేశీయ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్…కొత్త కొత్త ఫీచర్స్ తో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ను జోడిస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే చాలా ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసిన టెలిగ్రామ్ ఈ నెల ప్రారంభంలో ట్రాన్స్ లేషన్ ఫీచర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్లో ఇప్పుడు ఓ కొత్త అప్ డేట్ ను యాడ్ చేసింది. ఈ కొత్త అప్ డేట్ ప్రకారం, యూజర్లు తమకు వచ్చిన మెసేజ్ లను వారి స్థానిక లాంగ్వేజ్ లోకి ట్రాన్స్ లేట్ చేసుకోవచ్చు. అంతేకాదు…మీకు నచ్చిన భాషను డిఫాల్ట్ గా కూడా సెట్ చేసుకోవచ్చు. తద్వారా మీకు వచ్చే ప్రతి మెసేజ్ డిఫాల్ట్ గా మీకు కావాల్సిన భాషలోకి ట్రాన్స్ లేట్ అవుతుంది. ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్, iOSరెండింటిలోనూ అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతం టెలిగ్రామ్ కు పోటినిస్తోన్న పాపులర్ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో మాత్రం ట్రాన్స్ లేషన్ ఫీచర్ ఇంకా అందుబాటులో లేదు. దీంతో వాట్సాప్ యూజర్లను తన వైపు తిప్పుకునేలా ఈ సరికొత్త ఫీచర్ ను పరిచయం చేసినట్లు తెలుస్తోంది. మీరు టెలిగ్రామ్ లో ఏదైనా మెసేజ్ ను అనువాదం చేయాలనుకుంటే ఈ విధంగా చేయండి.

1. ఈ ఫీచర్ను ఉపయోగించడం చాలా తేలిక. అయితే ఈ ఫీచర్ సెల్ఫ్ యాక్టివేషన్ కాదు. కాబట్టి ముందుగా మీ టెలిగ్రామ్ యాప్ లో ఈ ఫీచర్ను ఎనేబుల్ చేసుకోవాలి.
2. దీనికోసం టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్లిన తర్వాత హాంబర్గన్ ఐకాన్ పై క్లిక్ చేయాలి.
3.సెట్టింగ్స్ లోకి వెళ్లి మీకు కావాల్సిన భాషపై క్లిక్ చేయండి.
4. లాంగ్వేజ్ మెనూ ఎగువ కుడి మూలంలో కనిపించే షో ట్రాన్స్ లేట్ బటన్ పై నొక్కండి.
5. షో ట్రాన్స్ లేట్ బటన్ కు కుడి దిగువన ఉన్న డు నాట్ ట్రాన్స్ లేట్ మరో ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు అవసరం లేని భాషను డిలీజ్ చేయవచ్చు. అయితే మీరు టెలిగ్రామ్ ను ఉపయోగిస్తున్న భాషలో ట్రాన్స్ లేషన్ ఆప్షన్ను పొందలేరు. ఉదా: మీరు టెలిగ్రామ్ ను ఇంగ్లీష్ లో ఉపయోగిస్తు…ఇంగ్లీష్ భాష నుంచి ఇతర భాషలకు డిఫాల్ట్ గా ట్రాన్స్ లేట్ చేసుకునే ఛాన్స్ లేదు.

6. ట్రాన్స్ లేషన్ ఫీచర్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడే అనేక పాపులర్ భాషలోకి మెసేజ్ లను ట్రాన్స్ లేట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ హిందీ భాషకు సపోర్టు ఇవ్వదు.
7. ఫీచర్ను యాక్టివేట్ చేసుకునేందుకు ఏదైనా చాట్ లేదా గ్రూప్ కు వెళ్లి మీరు అనువాదం చేయాలనుకునే మెసేజ్ పై ప్రెస్ చేయండి. వెంటనే మీకు ట్రాన్ లేషన్ పాప్ అప్ మెనూ ఓపెన్ అవుతుంది.
8.అక్కడున్న ట్రాన్స్ లేషన్ పై నొక్కండి. దీంతో మీ మెసేజ్ లు టెలిగ్రామ్ డిఫాల్ట్ లాంగ్వేజ్ లోకి అనువాదం అవుతాయి.