Google Chrome : క్రోమ్ లో కొత్త ఫీచర్..తెలిస్తే షాక్ అవుతారు..

గూగుల్ క్రోమ్ (Google Chrome) ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇకపై క్రోమ్ బ్రౌజర్ (Chrome Browser) నుంచి సైట్లను సందర్శించే సమయంలో పాస్ వర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేకపోవడమే ఈ కొత్త సదుపాయం. ఇందుకు వీలుగా గూగుల్ పాస్ కీస్ ను ప్రవేశపెట్టింది. పాస్ కీ అన్నది ప్రతి యూజర్ కు ప్రత్యేకమైన ఐడెంటిటితో కూడుకుని ఉంటుంది. ఇవి వ్యక్తిగత కంప్యూటర్లు (Computer), ఫోన్లు (Phone) లేదా యూఎస్ బీ (USB) సెక్యూరిటీ డివైజ్ లలోనే […]

Published By: HashtagU Telugu Desk
Google Chrome

Chrome

గూగుల్ క్రోమ్ (Google Chrome) ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఇకపై క్రోమ్ బ్రౌజర్ (Chrome Browser) నుంచి సైట్లను సందర్శించే సమయంలో పాస్ వర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేకపోవడమే ఈ కొత్త సదుపాయం. ఇందుకు వీలుగా గూగుల్ పాస్ కీస్ ను ప్రవేశపెట్టింది. పాస్ కీ అన్నది ప్రతి యూజర్ కు ప్రత్యేకమైన ఐడెంటిటితో కూడుకుని ఉంటుంది. ఇవి వ్యక్తిగత కంప్యూటర్లు (Computer), ఫోన్లు (Phone) లేదా యూఎస్ బీ (USB) సెక్యూరిటీ డివైజ్ లలోనే స్టోర్ అవుతాయి. అంటే ఆన్ లైన్ (Online) లో ఎక్కడా స్టోర్ కావు.

పాస్వర్డ్ కీస్ (Password Keys) ఇలా స్టోర్ అవ్వడం వల్ల ఇక ఆ తర్వాత నుంచి వివిధ వెబ్ సైట్లు, యాప్ లలో పాస్ వర్డ్ అవసరం లేకుండా లాగిన్ అయిపోవచ్చు. దీంతో ప్రతీ పోర్టల్ కు సంబంధించి యూజర్ పాస్ వర్డ్ లను గుర్తు పెట్టుకోవాల్సిన ఇబ్బంది తప్పిపోతుంది. పాస్ వర్డ్ అన్నది ఒక వ్యక్తికి సంబంధించిన గుర్తింపును ధ్రువీకరించేందుకు, అనధికారికంగా డేటాను మరొకరు పొందకుండా అడ్డుకునేందుకు ఉపయోగపడుతుంది.

పాస్వర్డ్ (Password) మరొకరికి తెలిస్తే.. నష్టం ఏర్పడుతుంది. కానీ, పాస్వర్డ్ కీస్ (Password Keys) మరొకరికి తెలిసే అవకాశం ఉండదు. సర్వర్ బ్రీచ్ అయినప్పటికీ, ఈ పాస్వర్డ్ కీస్ (Password Keys) లీక్ కావు. ఫిషింగ్ దాడుల నుంచి యూజర్లకు రక్షణ ఉంటుందని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్ లో పెట్టింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్యాటర్న్, పిన్ ద్వారా మనం ఫోన్ లో లాగిన అయినట్టుగా, పాస్ కీస్ సాయంతో ఆన్ లైన్ పోర్టళ్లలో లాగిన్ అయ్యేందుకు వీలుంటుంది. గూగుల్ క్రోమ్ (Google Chrome) లో ఆండ్రాయిడ్ (Android), విండోస్ 11 (Windows), మ్యాక్ ఓఎస్ (MAC OS) యూజర్లకు పాస్వర్డ్ కీస్ (Password Keys) అందుబాటులో ఉన్నాయి.

Also Read:  TTDP : తెలంగాణ‌పై చంద్ర‌బాబు దూకుడు!ఖ‌మ్మంలో ఎన్నికల శంఖారావం

  Last Updated: 12 Dec 2022, 12:49 PM IST