Site icon HashtagU Telugu

WhatsApp New Feature: వాట్సాప్‌ వీడియో కాల్‌లో అదిరే ఫీచర్.. ఇకపై రెండు పనులు ఒకేసారి చేయొచ్చు..

Mixcollage 11 Jan 2024 08 26 Pm 1874

Mixcollage 11 Jan 2024 08 26 Pm 1874

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. కాగా ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది.

ఇంతకీ ఆ ఫీచర్ ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్లో వీడియో కాల్ సమయంలోనే మ్యూజిక్ ప్లేయర్ నుంచి ఆడియోను షేర్ చేసేందుకు వినియోగదారులకు అనుమతి ఇస్తుంది. వాబీటాఇన్ ఫో ప్రకారం.. వీడియో కాల్ తో పాటు మ్యూజిక్ ఆడియోను కలిసి వినగలిగే సామర్థ్యం ఇప్పుడు కొంతమంది బీటా టెస్టర్‌ లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేకంగా, వీడియో కాల్‌లో ఉన్న ఎవరైనా వారి స్క్రీన్‌ను షేర్ చేసినప్పుడు, వారి పరికరంలో ప్లే చేసే ఆడియో కూడా ఇతర వ్యక్తులకు షేర్ చేయవచ్చు. ఈ ఫీచర్ వ్యక్తిగత కాల్‌లలో కూడా పని చేస్తుందని, వినియోగదారులు సింక్రనైజ్డ్ ఆడియో అనుభవాన్ని ఆస్వాదించవచ్చని నివేదిక చెబుతోంది.

అంటే ఒకరితో ఒకరు వీడియో కాల్ లో ఉన్నప్పుడు కూడా ఇద్దరూ కలిసి పాటలు వినొచ్చన్న మాట. ఈ కొత్ ఫీచర్ గ్రూప్లలో ఐక్యాతా భావాన్ని పెంచడంతో పాటు ఒకరితో ఒకరు మరింత సాన్నిహిత్యం పొందేందుకు వీలుంటుందని వాబీటా ఇన్ ఫో చెబుతోంది. అంతేకాక వీడియో కాల్లో ఉన్న వినియోగదారులు కలిసి వీడియోలను కూడా చూసే అవకాశం ఇప్పుడు వచ్చింది. వీడియో కాల్‌ల సమయంలో షేర్ చేసిన ఆడియోతో ప్రయోగాలు చేయవచ్చు, పాల్గొనేవారు వారి వీడియో ప్లేబ్యాక్ అనుభవాలను సింక్రనైజ్ చేయవచ్చు. వర్చువల్ గా మూవీ-చూడడం లేదా కంటెంట్-షేరింగ్ సెషన్‌ను ప్రారంభించడం వంటివి కూడా చేసుకోవచ్చు. రాబోయే వారాల్లో ఈ ఫీచర్ మరింత మందికి అందుబాటులోకి రానుంది..