Site icon HashtagU Telugu

Whatsapp: వాట్సాప్ తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్..వారికి గుడ్ న్యూస్

Whatsapp

Whatsapp

Whatsapp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. మెటా యాజమాన్యంతో ఈ యాప్ యూజర్లకు ఎంతగానో తోడ్పడుతోంది. అసలు ఈ రోజుల్లో వాట్సప్ వాడని వారంటూ ఎవ్వరూ ఉండరు. చిన్ని పిల్లల దగ్గరి నుంచి పెద్ద వారికి వరకూ అందరికీ వాట్సాప్ ఎంతగానో చేరువయ్యిందనే చెప్పాలి.

ఈ వాట్సాప్ లో తాజాగా మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా మనం ఒకరికి ఏదైనా మెస్సేజ్ పెట్టి దాన్ని అవతల వ్యక్తి చూడకుండా డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి దాన్ని డిలీట్ చేస్తాం. అయితే ఒక్కోసారి పొరపాటున డిలీట్ ఫర్ ఎవ్రీవన్ నొక్కాల్సింది పోయి డిలీట్ ఫర్ మీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసేస్తుంటాం. అలాంటి సమయంలో అవతలి వ్యక్తి తమ మెస్సేజులు చూస్తారని తెగ టెన్షన్ పడుతుంటాం. అయితే ఇకపై అలా బాధపడాల్సిన పనిలేదు.

వాట్సాప్ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫీచర్ లో మనం ఎవరికైనా మెస్సేజ్ చేస్తే డిలీట్ చేయడం ఇప్పుడు సులభం. మనం పొరపాటున డిలీట్ ఫర్ మీ నొక్కుతాం. అలాంటప్పుడు కొత్త ఫీచర్ ప్రకారం వాట్సాప్ యాక్సిడెంటల్ డిలీట్ పేరుతో దీనిని తీసుకొచ్చింది. దీని వల్ల మనం డిలీట్ చేసిన మెస్సేజ్ ను సెలక్ట్ చేసుకుంటే అక్కడ అన్ డూ అనే ఆప్షన్ వస్తుంది. ఆ సమయంలో మనం డిలీట్ చేసేసిన ఆ మెస్సేజ్ ను తిరిగి తెప్పించుకోవచ్చు. అలా తెప్పించుకున్న తర్వాత డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయొచ్చు. ఈ ఫీచర్ వల్ల చాలా మందికి మంచి ఉపయోగం ఉంటుంది.

Exit mobile version