Horwin Senmenti EV Scooty: మార్కెట్ లోకి కొత్త స్కూటర్.. ఇది స్కూటర్ కాదు.. అంతకు మించి?

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఇది క్రేజ్ డిమాండ్ విపరీతంగా

  • Written By:
  • Publish Date - March 7, 2023 / 07:00 AM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఇది క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. దాంతో మార్కెట్లోకి ఎక్కువగా ఇంధనంతో నడిచే వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రానిక్ సంస్థలు ఒకదాన్ని మించి మరొకటి కొత్త కొత్త ఫీచర్స్ సరికొత్త లుక్ లో అద్భుతమైన ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల అయింది. హార్విన్ సెన్మెంటి అనే పేరుతో ఎలక్ట్రానిక్ స్కూటర్ మార్కెట్లోకి విడుదల అయింది.

ఆకర్షణీయమైన డిజైన్, అత్యాధునిక సాంకేతికతతో వస్తోంది. ఇందులోని బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. మీరు ఎక్కువ దూరం ప్రయాణించే స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటే, ఇతర కంపెనీలతో పోల్చితే ఈ స్కూటర్ తక్కువ ధరకే మంచి రేంజ్‌ను అందిస్తోంది. కాగా హార్విన్ కంపెనీకి చెందిన ఈ ఎలక్ట్రానిక్ స్కూటర్ ప్రత్యేకమైన డిజిటల్ ఫీచర్లను అందిస్తుంది. అంతేకాక భద్రతకు అధిక ప్రాధన్యమిస్తూ సమీపంలోని వస్తువులను గుర్తించగల కెమెరాను ఇందులో అమర్చారు. దూర ప్రాంతాలకు ప్రయాణించాలనుకుంటే ఇదే మీకు బెస్ట్ స్కూటర్.

ఎందుకంటే ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కి.మీ. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర విషయానికి వస్తే.. ఇది దాదాపు లక్ష రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని డిజిటల్ ఫీచర్ల ప్రకారం, ఈ స్కూటర్ ధర దాదాపు రూ. 115,000 ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..