ప్రస్తుతం దేశీయ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది. వాహన వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపడంతో వీటికి డిమాండ్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది కానీ చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలి అంటే వాటి మైలేజ్ విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం కొన్ని కిలోమీటర్ల వరకు మాత్రమే ప్రయాణించగలవు లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు ఏంటి అన్న ఆలోచన చాలా మందికి తలెత్తుతోంది. వాహనదారుల ఇటువంటి ఆలోచనలను దృష్టిలో పెట్టుకున్న ఆయా కంపెనీలు మార్కెట్లోకి మంచి మైలేజ్ వచ్చే ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు వచ్చిన కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ లు కేవలం 120 కిలోమీటర్లకు మించి మైలేజ్ ఆఫర్ ను ఇవ్వలేకపోతున్నాయి. కానీ ప్రస్తుతం మరో ఎలక్ట్రిక్ స్కూటర్ అధిక మైలేజ్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు ఏకంగా 225 కి.మి మైలేజ్ ఇస్తుంది. అంటే కేవలం 15 పైసల ఖర్చుతో ఓ కిలోమీటర్ ప్రయాణించవచ్చు. ఎన్ డీఎస్ ఎకో మోటర్స్ తన కొత్త మోడల్ స్కూటర్ లియో ప్లస్ ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఈ బైక్ రఫ్ అండ్ టఫ్ లుక్ తో వినియోగదారుల మనస్సును గెలుచుకుంటుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. ఈ బైక్ ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎన్ డీఎస్ లియో ప్లస్ ధర, మోటార్ కెపాసిటీ ,ఎన్ డీఎస్ లియో ప్లస్ రూ.1,23,978 ఎక్స్ షోరూమ్ ప్రైస్ రేంజ్లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ న్యూడిల్లీ లో అయితే ఆన్ రోడ్ ప్రైస్ రూ1,28,657 అవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లియో ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 72వీ, 21 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు 1600 డబ్ల్యూబీఎల్ డీసీ మోటార్‌తో శక్తిని పొందుతుంది. కాగా ఈ బ్యాటరీ ప్యాక్ సాధారణ ఛార్జర్‌తో ఛార్జ్ చేసినప్పుడు 2 నుంచి 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ లియోప్లస్ బైక్ ను ఒక్కసారి చార్జ్ చేస్తే 225 కిలో మీటర్ల రైడింగ్ రేంజ్ ఇస్తుంది. అలాగే గంటకు 55 కిలోమీటర్ల స్పీడ్ రేంజ్ తో వెళ్ళవచ్చు. ఇది ఎకానమీ మోడ్ లో 225 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే సాధారణ మోడ్ లో 190 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. మూడో మోడ్ పవర్ మోడ్ లో 175 కిలోమీటర్ల మైలేజ్ ను ఇస్తుంది.