Site icon HashtagU Telugu

Netflix: నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాక్..!

05citxl96l4le9n02wfdr0h 5

05citxl96l4le9n02wfdr0h 5

ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. త్వరలో పాస్ వర్డ్ షేరింగ్ పై అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అదనపు చార్జీలు వచ్చే ఏడాది ఏడాది నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. అయితే వినియోగదారులు పాస్ వర్డ్ షేరింగ్ పై ఎంత చార్జీలు వసూలు చేస్తుందనే అంశం పై నెట్‌ఫ్లిక్స్ స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ పలు నివేదికల ప్రకారం భారత్ లో రూ. 240 ఉండే అవకాశం ఉంది.

నెట్‌ఫ్లిక్స్ 2023 నుండి పాస్‌వర్డ్ షేరింగ్‌ను అరికట్టాలని యోచిస్తోంది. వినియోగదారులకు వారి ప్రొఫైల్‌లను కొత్త ఖాతాలకు బదిలీ చేసే సామర్థ్యాన్ని అందించిన తర్వాత, “ఖాతా షేరింగ్‌ని మానిటైజ్ చేయాలనే దాని ప్లాన్‌లకు అనుగుణంగా సబ్‌క్రైబర్‌లను వచ్చే ఏడాది నుండి సబ్‌ అకౌంట్‌లను క్రియేట్ చేయడాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. సాధారణంగా ఒకరి పాస్‌వర్డ్ తీసుకొని నెట్‌ఫ్లిక్స్‌లోని వీడియోలను కొందరు చూస్తుంటారు. అప్పుడు మై లిస్ట్‌, వ్యూయింగ్ హిస్టరీ క్రియేట్ అవుతాయి. వీటిని వారు తమ సొంత సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు కోల్పోవాల్సి వస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన యూజర్లను ఈ ఫీచర్‌ను రిలీజ్ చేయడం ప్రారంభించింది. ఎక్స్‌ట్రా ఛార్జ్‌ చెల్లించకూడదు అనుకునేవారికి కూడా ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ బాగా హెల్ప్ అవుతుంది.