NASA: చ‌రిత్ర సృష్టించిన నాసా.. ఆస్ట్రేలియా నుండి రాకెట్ ప్ర‌యోగం!

అంగారక గ్రహంపై నివాసం యోగ్యమా కాదా కనుగొనేందుకు అంతర్జాతీయ పరిశోధన సంస్థనాసా మరోసారి ప్రయోగానికి సిద్ధమైంది.

  • Written By:
  • Publish Date - June 30, 2022 / 10:00 AM IST

అంగారక గ్రహంపై నివాసం యోగ్యమా కాదా కనుగొనేందుకు అంతర్జాతీయ పరిశోధన సంస్థనాసా మరోసారి ప్రయోగానికి సిద్ధమైంది. జూలై మొదటివారంలో ఖగోళ శాస్త్రవేత్తలు ఉత్తర ఆస్ట్రేలియా నుంచి రెండు సౌండింగ్ రాకెట్లను ప్రయోగించనున్నారు.ఈరాకెట్లు ఖగోళం వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకునేందుకు దోహదపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వాటి సామర్థ్యం వలన మనుషులు అక్కడే జీవించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా లేవా అన్నది.. రాకెట్ల సామర్థ్యం ద్వారా తెలుసుకోవచ్చని అంటున్నారు.

ఇక జూన్ 26న ప్రయోగించిన మిషన్ విజయవంతం కావడంతో.. మరో రెండు రాకెట్లను ప్రయోగించేందుకు నాసా సిద్ధమైంది. సూర్యూడిని పోలిన ఆల్ఫా సెంటారీ A&B రెండు మిషన్లను అతినీలలోహిత కాంతి కిరణాల ఆధారంగా శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. మానవ కంటికి కనిపించే కాంతి కంటే తక్కువ తరంగదైర్ఘ్యాలను.. అతినీలలోహిత కిరణాలు కలిగి ఉండటం మూలానే వాటిని పరిశోధనకు ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.

సూర్యడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల వలన అంగారక గ్రహంలో.. మానవుడు నివసించడానికి నివాసయోగ్యమా కాద అన్నది అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయెగపడుతుందని ఖగోళ శాస్త్రవేత్త కొలరాడో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త బౌల్డర్ అన్నారు. విశ్వంలో అనేక నక్షత్రాలు ఉన్నప్పటికి భూమి మాత్రమే నివాసానికి ఆమోదయోగ్యం. దీంతో ఒకే కక్ష్యలో ఉండే గ్రహలపై నివాసయోగ్యమా కాదా అన్నది తెలుసుకునేందుకు.. అంగారక గ్రహంపై దృష్టి సారించామని మరో శాస్త్రవేత్త ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాురు.