ఇటీవల కాలంలో వ్యవసాయం (Agriculture) చేయడం చాలామంది తగ్గించేశారు. ఉన్నంత చదువులు చదువుకొని జాబ్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం భూమి ఫై ఉన్న ప్రేమతో వ్యవసాయం చేస్తూ వస్తున్నారు. అయితే గతంలో మాదిరి ఎడ్లు కట్టి , నాగలి కట్టి వ్యవసాయం చేయడం తో మార్కెట్ లోకి వచ్చిన అధునాతన పనిముట్లు ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నారు. దీనివల్ల శ్రమ తక్కువ అవ్వడం తో పాటు డబ్బులు కూడా సేవ్ అవుతున్నాయి. దీంతో చాలామంది వ్యవసాయానికి పనికొచ్చే వాటిని తయారు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
తాజాగా బ్రహ్మచారి (Brahmachari ) అనే వెల్డింగ్ చేసే వ్యక్తి చిన్న నానో ట్రాక్టర్ (Nano Tractor) ను తయారు చేసి వార్తల్లో నిలిచారు. వ్యవసాయానికి ఉపయోగపడే కర్లు, ఇనుప నాగళ్లను తయారు చేసే బ్రహ్మచారి ..ప్రస్తుతం ఎడ్ల వాడకం పూర్తిగా తగ్గించారని కోణంలో ఏదైనా కొత్తగా ట్రై చేయాలనీ చెప్పి ఓ మినీ ట్రక్టర్ ను రూపొందించాలని అనుకున్నాడు. ఆ ఆలోచన రావడమే ఆలస్యం..పని మొదలుపెట్టాడు. ఈ ట్రాకర్ట్ నడపాలంటే అనుభవం ఉన్న డ్రైవర్ అవసరం లేదు. పెద్ద ట్రాక్టర్ తో కూడా చేయలేని కొన్ని పనులు దీంతో చేయొచ్చని బ్రహ్మచారి నిరూపించాడు. అంతర పంటల సాగుకు ఈ మినీ ట్రాక్టర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ట్రాక్టర్ టన్ను బరువును లాగగలదు అని తెలిపాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ట్రాక్టర్ ప్రత్యేకతలు (Nano Tractor Specialities)..
* ట్రాక్టర్ బరువు 150కిలోలు
* నాలుగు అడుగుల పొడవు, 30 ఇంచుల వెడల్పు, రెండు అడుగుల ఎత్తు
* ఇంజిన్ కెపాసిటీ 4హెచ్ పీ(హార్స్ పవర్), డీజిల్, పెట్రోల్తో నడుస్తుంది.
* ఈ ట్రాక్టర్ ఖర్చు లక్షా 40వేల రూపాయలు
* ఈ ట్రాక్టర్ నడవాలంటే గంటకు ఒక లీటర్ డీజిల్ అవసరం పడుతుంది.
* ఈ ట్రాక్టర్ వేగం గంటకు 10 నుండి 15 కిలోమీటర్ల స్పీడు
* దీనికి ఐదు గేర్లు ఉంటాయి. అందులో ఒకటి రివర్స్ గేర్.. స్టీరింగ్ దగ్గరే బ్రేక్, గేర్ లు ఉంటాయి. మొత్తం చేతులతోనే ఆపరేట్ చెయ్యొచ్చు. కాలితో చేయాల్సిన పని ఏమీ ఉండదు.
* సాళ్లకు తగినట్లు 4 అంగుళాల వెడల్పు వరకు తగ్గించుకోవటం, పెంచుకోవటం చేసుకోవచ్చు.
* సాళ్ల మధ్య కలుపు మొక్కలను కూడా తొలగించవచ్చు.
* ఉద్యానవన పంటల్లో చెట్ల చుట్టూ దున్నుకోవచ్చు. గొర్రు, దంతె, రోటోవేటర్ లాంటివాటిని బిగించుకోవచ్చు. అంతేకాకుండా గ్రామాలు, పట్టణాల్లో ఇరుకు వీధుల్లో కూడా చెత్త రవాణాకు వినియోగించవచ్చు. దీని మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువే కాబట్టి పేద రైతులకు ఎంతో ఉపయోగం.
Read Also : Prajabhavan : చంద్రబాబు కు ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి
