Site icon HashtagU Telugu

MYBYK Electric: స్కూటర్ లాంటి సైకిల్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?

Mybyk Electric

Mybyk Electric

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రస్తుతం మార్కెట్లో ఇంధనంతో నడిచే వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల హవానే ఎక్కువగా నడుస్తోంది. పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతుండడంతో వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కాగా విద్యుత్ శ్రేణిలో బస్సులు, కార్లు, బైక్లు, స్కూటర్లే కాకుండా సైకిళ్లు కూడా పెద్ద సంఖ్యలో మార్కెట్లో విడుదల అవుతున్నాయి. తక్కువ దూరాలకు, వ్యాయామ పరమైన వాటికి ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ ఆరోగ్యంతో పాటు సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయి.

ఇటీవల కాలంలో వీటి వినియోగం కూడా విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో మైబైక్ అనే కంపెనీ రెండు కొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లను మన దేశంలో లాంచ్ చేసింది. ఈ కంపెనీ స్టేషన్ ఆధారిత సైకిల్ షేరింగ్, రెటింగ్ సర్వీస్ లను కూడా నిర్వహిస్తూ ఉంటుంది. ఇప్పడు ఇది మన దేశ మార్కెట్ లోకి విడుదల అయ్యింది. మైబైక్ ఎలక్ట్రిక్, మైబైక్ ఎలక్ట్రిక్ కార్గో పేర్లతో రెండు సైకిళ్లను ఆవిష్కరించింది. మైబైక్ ఎలక్ట్రిక్ సైకిల్ సాధారణ పౌరులు, టూరిస్టుల కోసం డిజైన్ చేశారు. మైబైక్ ఎలక్ట్రిక్ కార్గో గిగ్ వర్కర్ల డెలివరీ కష్టాలు తీర్చేందుకు తీసుకొచ్చింది. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ఫీచర్ల విషయానికి వస్తే..

మైబైక్ అనే సంస్థ ఇప్పటికే మన దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో 10,000 కంటే ఎక్కువ పెడల్ సైకిల్ ఆధారిత పబ్లిక్ బైక్ షేరింగ్ సిస్టమ్‌ను నిర్వహిస్తోంది. ఇప్పుడు ఇది అంతర్గతంగా అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ సైకిళ్లతో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఈ సైకిల్ మైబైక్ యాప్‌ సాయంతో పనిచేస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. కీలెస్ సైకిల్ అన్‌లాకింగ్, కీలెస్ బ్యాటరీ అన్‌లాకింగ్ సదుపాయాలు ఉంటాయి. పరిస్థితులను బట్టి 80 – 100 కిమీల పరిధిని అందిస్తుంది. దీనిలో 0.54 KwH సామర్థ్యం గల స్వాపబుల్ బ్యాటరీ ఉంటుంది. అలాగే మైబైక్ ఎలక్ట్రిక్‌తో వినియోగదారులకు ఆరోగ్యంతో పాటు దూర ప్రయాణాలు కూడా చేయగలరు. ఇది ఆరోగ్యం కోసం పెడల్ చేయవచ్చు.. అలాగే దూరం వెళ్లడానికి స్కూటర్ లా కూడా వినియోగించుకోవచ్చు. సాధారణ సైకిల్ పెడల్ చేయడం ద్వారా వినియోగదారులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే ప్రయాణ ప్రయోజనాల కోసం తక్కువ వేగంతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్‌ లా కూడా ఉపయోగపడుతుంది.