Site icon HashtagU Telugu

Vo5G : స్మార్ట్‌ఫోన్లలో మరో విప్లవం ‘వో5జీ’.. ఏమిటిది ?

Vo5g

Vo5g

Vo5G : టెలికాం రంగంలో టెక్నాల‘జీ’లు నానాటికీ అప్‌గ్రేడ్ అవుతున్నాయి. ఒకప్పుడు 2‘జీ’తో రెక్కలు తొడిగిన టెలికాం సేవలు.. ఇప్పుడు 5‘జీ’ దాకా చేరాయి. త్వరలోనే 5జీని మించిన మరో ముందడుగు పడనుంది. దానిపేరే.. వో5జీ(Vo5G). వో5జీ అంటే.. వాయిస్‌ ఓవర్‌ 5జీ.  దీన్నే వాయిస్‌ ఓవర్‌ న్యూ రేడియో అని కూడా పిలుస్తారు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఫ్యూచర్‌లో వాయిస్‌ కాలింగ్‌ కొత్త పుంతలు తొక్కుతుంది. స్మార్ట్‌ఫోన్‌ కమ్యూనికేషన్‌లో మరో కొత్త శకం మొదలవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

4జీ ఫోన్లు వచ్చిన కొత్తలో వాటిలో వాయిస్‌ ఓవర్‌ ఎల్‌టీఈ (వోల్టే) టెక్నాలజీ ఉండేది కాదు. ఎల్‌టీఈ మీదే పనిచేయటం వల్ల కాల్‌ డ్రాప్స్‌ సమస్యలు ఎదురయ్యేవి. ఇప్పుడు 5జీ ఫోన్లలోనూ ఇలాంటి ప్రాబ్లమే తలెత్తుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి వచ్చిందే వో5జీ(Vo5G). 5జీ నెట్‌వర్క్‌లో కాల్‌ డ్రాప్స్‌ కాకుండా చూడటానికి ఈ టెక్నాలజీని తయారు చేశారు. వో5జీ టెక్నాలజీ అనేది ‘ఎల్‌టీఈ’తో కాకుండా ‘5జీ’తో కాల్స్‌కు అనుమతిస్తుంది. హయ్యర్‌ బ్యాండ్‌విడ్త్‌, తక్కువ జాప్యంతో కూడుకున్న టెక్నాలజీ కావడం వల్ల వో5జీతో చేసే కాల్స్ నాణ్యత చాలా బెటర్‌గా మారుతుంది. ఇంటర్నెట్‌ వేగం పెరుగుతుంది. ఫలితంగా  5జీ వేగం, సామర్థ్యం, ప్రతిస్పందన తీరు అనేది ఫోన్లలో మనం ఫీల్ కావచ్చు.

Also Read: Telangana Ministers : ఖమ్మం నుంచి ఆ ఇద్దరిలో ఒక్కరికే మంత్రి ఛాన్స్ ?!

మన దేశంలో ఇంకా వో5జీ అందుబాటులోకి రాలేదు. వో5జీ(Vo5G) టెక్నాలజీని సపోర్టు చేసే ఫోన్‌‌తో పాటు 5జీ సిగ్నల్‌ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మనం వాడొచ్చు. ఈ ఫీచర్‌ చాలా ఫోన్లలో డీఫాల్ట్‌గానే ఆన్‌ అయ్యి ఉంటుంది. అయినా సెట్టింగ్స్‌లో మరోసారి చెక్ చేసుకోవడం బెటర్.

Exit mobile version