Worlds Thinnest Flip Phone : ప్రపంచంలోనే సన్నని ఫ్లిప్ ఫోన్.. త్వరలో లాంచింగ్

Worlds Thinnest Flip Phone : ప్రపంచంలోనే అతి సన్నని ఫ్లిప్ ఫోన్ కొన్ని రోజుల్లో మన ముందుకు రాబోతోంది. ఈ ఫోన్ ను మోటరోలా (Motorola) కంపెనీ లాంచ్ చేయబోతోంది. 

  • Written By:
  • Updated On - June 13, 2023 / 01:08 PM IST

Worlds Thinnest Flip Phone : ప్రపంచంలోనే అతి సన్నని ఫ్లిప్ ఫోన్ కొన్ని రోజుల్లో మన ముందుకు రాబోతోంది. 

ఈ ఫోన్ ను మోటరోలా (Motorola) కంపెనీ లాంచ్ చేయబోతోంది. 

6.69 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే.. 3.6 అంగుళాల కవర్ డిస్‌ప్లే  కలిగిన ఈ ఫోన్ గురించి ఆసక్తికర వివరాలివీ.. 

జూన్ 22వ డేట్ కోసం ఫోన్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫ్లిప్ ఫోన్ రేజర్ 40 అల్ట్రా(Razr 40 Ultra)ను మోటరోలా కంపెనీ ఆ రోజే ఇండియాలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీని ధర రూ. 66,000 దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి లుక్ ను(Worlds Thinnest Flip Phone) Motorola కంపెనీ ఇప్పటికే తమ అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ఖాతాలలో రిలీజ్ చేసింది. ఫోన్ కు సంబంధించిన అన్ని స్పెసిఫికేషన్‌లను జూన్ 22 న వెల్లడిస్తామని తెలిపింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లతో ముడిపడిన చాలా వివరాలు మీడియా రిపోర్ట్స్ లో బయటికి వచ్చాయి. ఇప్పుడు ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం.

Motorola Razr 40 Ultra స్పెసిఫికేషన్‌లు ఇవీ.. 

  • డిస్‌ ప్లే : Motorola Razr 40 Ultra ఫోన్ లో 165 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.69 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే ఉంటుంది. 144 Hz రిఫ్రెష్ రేట్‌తో ఫోన్‌లో 3.6 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంటుంది. 1056×1066 రిజల్యూషన్‌తో POLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్  స్క్రీన్‌ను గొరిల్లా గ్లాస్ రక్షిస్తుంది.
  • హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ :  ఈ ఫోన్ లో  Qualcomm Snapdragon 8 Plus Gen 1 ప్రాసెసర్‌ని వాడారు. ఆండ్రాయిడ్ 13 ఇందులో ఉంటుంది.
  • కెమెరా: ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 12 MP ప్రైమరీ కెమెరా, 13 MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ,  వీడియో కాలింగ్ కోసం పంచ్ హోల్ డిజైన్‌తో 32 MP కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ, ఛార్జింగ్: పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 30W వైర్డ్, 5W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3,800 mAh బ్యాటరీ ఉంటుంది.
  • కనెక్టివిటీ ఎంపిక : ఈ ఫోన్ లో కనెక్టివిటీ కోసం ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌తో ఛార్జ్ చేయడానికి 5G, 4G, 3G, Wi-Fi 6, బ్లూటూత్, GPS, NFC, USB టైప్ Cలను ఇచ్చారు.
  • విడ్జెట్‌లు : ఈ ఫోన్ లో మ్యూజిక్ కంట్రోల్స్, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, యాప్ నోటిఫికేషన్‌లు, వాతావరణ సమాచార విడ్జెట్‌లు కూడా ఉన్నాయి.

Motorola Razor 40 Ultra ధర

• ఈ ఫోన్ బేస్ వేరియంట్ 8 GB RAM + 256 GB స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ.66,000 ఉండొచ్చు.

• టాప్ వేరియంట్ 12GB RAM + 512GB స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర రూ.74,000 ఉండొచ్చు.