Site icon HashtagU Telugu

Moto G84 5G: మార్కెట్ లోకి మరో మోటోరోలా 5జీ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

Moto G84 5g

Moto G84 5g

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం మోటోరోలా ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్కెట్ లో మోటోరోలా స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరిగిపోతుండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అంతేకాకుండా అన్ని రకాల కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధర నుంచి ఎక్కువ ధరలకు కలిగే స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది మోటోరోలా సంస్థ.

ఇది ఇలా ఉంటే మోటోరోలా భారత మార్కెట్లోకి మోటో జీ84 పేరుతో కొత్త 5జీ ఫోన్‌ను తీసుకురాబోతోంది. మిడ్ రేంజ్‌ బడ్జెట్‌ను టార్గెట్‌ చేస్తూ ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. వచ్చే నెల అనగా సెప్టెంబర్‌ 1వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. కాగా త్వరలోనే విడుదల కానున్న ఈ స్మార్ట్ ఫోన్‌ను లేటెస్ట్ మోటో ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, వివా మాగ్నెంటా, మార్ష్‌మాలో బ్లూ కలర్స్‌లో తీసుకురానున్నారు. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.5 ఇంచెస్‌ పోల్డ్‌ డిస్‌ప్లేను అందించారు.

ఇక మోటో జీ84 5జీ స్మార్ట్ ఫోన్‌లో డాల్బీ అట్మాస్‌ సపోర్ట్ ఫీచర్లను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 30 వాట్స్‌ ఛార్జింగట్‌ టెక్నాలజీతో పనిచేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్ధ్యాన్ని కూడా అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో ఐపీ54 రేటింగ్‌తో డస్ట్‌, స్లాష్‌ రెసిస్టెన్స్‌ ఇచ్చారు. ఇకపోతే ఈ కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. అలాగే ఇందులో సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ రూ. 20 వేల లోపు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.