Site icon HashtagU Telugu

Motorola Razr 50: తక్కువ ధరకే మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?

Mixcollage 20 Jun 2024 03 20 Pm 1121

Mixcollage 20 Jun 2024 03 20 Pm 1121

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ మోటోరోలా ఇండియన్‌ మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. అంతే కాకుండా వినియోగదారులందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ ని కూడా అందిస్తోంది. ఇది ఇలా ఉండే మోటోరోలా సంస్థ తాజాగా బడ్జెట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే తీసుకురాబోతోంది.

మోటోరోలో రేజర్‌ 50 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. జూన్‌ 25వ తేదీన ఈ ఫోన్‌ను లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మొదట చైనా మార్కెట్లోకి తీసుకొచ్చి తర్వాత గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేయనున్నారు. మరి ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే.. మోటోరోలా రేజర్‌ 50 ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.9 ఇంచెస్‌తో కూడిన ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఫోల్డ్ చేసిన తర్వాత 3.6 ఇంచెస్‌తో కూడిన కవర్‌ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 2640*1080 పిక్సెల్ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్ సొంతం.

అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్ 8ఎస్‌జెన్‌ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 4000 ఎమ్‌ఏహెచ్‌ తో కూడిన బ్యాటరీని కూడా అందిస్తుంది. ఇకపోతే ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌ తో కూడిన ప్రైమరీ సెన్సార్‌, 2ఎక్స్‌ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50 మెగాపిక్సెల్స్‌ టెలిఫొటో లెన్స్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను కూడా ఇవ్వనున్నారు. ఇక
ధర విషయానికొస్తే.. మోటోరోలా గతంలో తీసుకొచ్చిన రేజర్‌ 40 ధర ఏకంగా రూ. 89,999గా ఉండగా మోటోరోలా రేజర్‌ 50 ధర రూ. 58,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మోటోరోలా వినియోగదారులకు ఇది పండుగ లాంటి వార్త అని చెప్పాలి.

Exit mobile version