Site icon HashtagU Telugu

Motorola Edge 50 Neo: తక్కువ ధరకే మార్కెట్లోకి రాబోతున్న మరో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్.. పూర్తి వివరాలివే?

Mixcollage 16 Jul 2024 03 31 Pm 8613

Mixcollage 16 Jul 2024 03 31 Pm 8613

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా భారత మార్కెట్ లోకి కొత్త ఫోన్‌ ను లాంచ్‌ చేస్తోంది. మోటోరోలా ఎడ్జ్‌ 50 నియో పేరుతో ఈ ఫోన్‌ ను తీసుకొస్తున్నారు. మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా, మోటోరోలా ఎడ్జ్50 ప్రోకి కొనసాగింపుగా ఈ ఫోన్‌ ను తీసుకురాబోతున్నారు. ఇకపోతే త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే.. కాగా ఈ మోటోరాలో ఎడ్జ్‌ 50 నియో ఫోన్‌ ను 8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ లలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే.. 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 23,999 కాగా, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 25,999గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ మనకు గ్రే, బ్లూ, పోయిన్సియానా, మిల్క్ వంటి కలర్స్‌ లలో లభించునుంది. ఇక ఈ ఫోన్‌లో 6.55 ఇంచెస్‌ తో కూడిన పీ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. 144Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్‌ తో ఈ ఫోన్‌ స్క్రీన్‌ ను అందించనున్నారు. అదేవిధంగా అలాగే స్క్రీన్ ప్రొటెక్షన్‌ కోసం గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌ ను కూడా అందించనున్నారు.

ఇక ఈ ఫోన్‌ లో ఐపీ 68 వాటర్‌ రెసిస్టెంట్‌ ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ 6879 డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌ ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌ లో 50 మెగా పిక్సెల్స్‌ తో కూడిన డ్యూయల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ ను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగా పిక్సెల్స్‌ తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నట్లు సమాచారం.

Exit mobile version