Site icon HashtagU Telugu

Moto G34: భారత మార్కెట్ లోకి విడుదలైన సరికొత్త మోటరోలా స్మార్ట్ ఫోన్.. ధర ఫీచర్స్ ఇవే?

Mixcollage 10 Jan 2024 02 12 Pm 5999

Mixcollage 10 Jan 2024 02 12 Pm 5999

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ మోటోరోలా ఇండియన్‌ మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటుగా ఆల్రెడీ మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా మోటోరోలా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంతకీ ఆ స్మార్ట్ఫోన్ ఏది? ఆ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. మోటోరోలా మోటో జీ34 పేరుతో 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌లో 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఫోన్‌ను తీసుకొచ్చారు. గత ఏడాది చైనాలో డిసెంబర్‌లో లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ను తాజాగా మంగళవారం లాంచ్‌ చేశారు.

కాగా ఈ మోటో జీ34 5జీ స్మార్ట్ ఫోన్‌ ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 10,999గా నిర్ణయించారు. ఇక 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 11,999గా ఉంది. లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై రూ. వెయ్యి ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌ను రూ. 10 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇక మంగళవారం భారత్‌లో లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ సేల్‌ జనవరి 17వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. మూడేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందించనున్నారు.

అలాగే ఆండ్రాయిడ్ 15కి ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇక స్క్రీన్‌ విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 720×1,600 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 20:9 యాక్సెప్ట్ రేషియో ఈ స్క్రీన్‌ సొంతం. పాండా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ను ఈ స్క్రీన్‌ను అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్‌ను అందించనున్నారు. వర్చువల్‌గా ర్యామ్‌ను 16జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియోల కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో స్టోరేజ్‌ని ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 5జీ నెట్‌వర్క్‌, వైఫై 802.11, బ్లూటూత్‌, ఎఫ్‌ రేడియో, 3.5 ఎమ్‌ఎమ్‌ హెడ్‌ఫోన్‌ జాక్‌, యూఎస్‌బీ టైప్‌ సీ పోర్ట్‌ వంటి ఫీచర్లను అందించారు. ఇక మోటో జీ 34 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో 29 వాట్స్‌ టర్బో పవర్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.