Site icon HashtagU Telugu

Moto G75: మార్కెట్ లోకి మరో మోటో కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

Moto G75

Moto G75

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ మోటోరోలా మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటో జీ75 పేరుతో ఈ ఫోన్‌ ను తీసుకొచ్చారు. త్వరలోనే ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ కి సంబంధించి ధర ఫీచర్ల విషయానికొస్తే.. అయితే భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే గ్లోబల్‌ మార్కెట్ ఆధారంగా ఈ ఫోన్‌ ధర 299 యూరోలుగా నిర్ణయించారు.

అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ. 27 వేల వరకు ఉండవచ్చని సమాచారం. అయితే ఇండియాలో ఈ ధర మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇకపోతే ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే మోటో జీ75 స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్‌ 3 ప్రాసెసర్‌ ను అందించారు. ఈ ఫోన్‌ 8జీబీ ర్యామ్‌తో పని చేస్తుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 15 వాట్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని కూడా అందించారు. అలాగే ఈ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ హాల్‌ పంచ్‌ స్క్రీన్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఇందులో 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ స్క్రీన్‌ను అందించారు.

ఇకపోతే కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50 మెగా పిక్సెల్స్‌, 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ మాక్రో విజన్‌ సెన్సార్‌ తో కూడిన డ్యూయల్‌ కెమెరా సెటప్‌ను కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. కాగా ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్స్ తో పాటు కలర్ వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది..