Motorola Smartphone: తక్కువ ధరకే మోటోరోలా స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన మోటోరోల

  • Written By:
  • Publish Date - August 15, 2023 / 07:37 PM IST

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్ లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన మోటోరోలా సంస్థ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. కాగా మోటోరోలా ఇటీవల వరుసగా బడ్జెట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్ లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లలో కొత్త కొత్త ఫీచర్ లను పరిచయం చేస్తోంది. అలాగే ఆ ఫోన్ లపై భారీగా తగ్గింపు ప్రకటిస్తోంది. ఇది ఇలా ఉంటే మోటోరోలా ఒక కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది.

కేవలం రూ. 8,999కే అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది ప్రముఖ ఈ -కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్, మోటోరోలా ఆన్ లైన్ స్టోర్, ఆఫ్ లైన్ స్టోర్లలో ఆగస్టు 16 నుంచి విక్రయాలకు రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకు కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ కలర్ ఆప్షన్ లలో అందుబాటులో ఉంది. కంపెనీ పలు ప్రారంభ ఆఫర్ లను అందిస్తోంది. రిలయన్స్ జియో వినియోగదారులు రూ. 2,500 వరకూ పలు క్యాష్ బ్యాక్, గిఫ్ట్ వోచర్స్ ను అందిస్తోంది. ఇకపోతే మోటో ఈ 13 స్పెసిఫికేషన్ ల విషయానికి వస్తే.. ఈ కొత్త మోటో ఈ 13 స్మార్ట్ ఫోన్లో టీ606 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే, హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ తో ఉంటుంది.

ప్రీమియం అక్రిలిక్ గ్లాస్ బాడీతో ఉంటుంది. 179.5 గ్రాముల బరువు ఉంటుంది. కాగా కెమెరా విషయానికి వస్తే.. వెనుకవైపు 13 మెగా పిక్సల్ సెన్సార్ ఉంటుంది. ముందు వైపు 5ఎంపీ కెమెరా ఉంటుంది. రెండు కెమెరాలకు ఎఫ్/2.2 అపెర్చుర్ తో ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్ తో వీడియోలు రికార్డు చేయగలుగుతాయి. వెనుక వైపు కెమెరా ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ కు సపోర్టు చేస్తుంది. కెమెరా ఫీచర్లను గమినస్తే పోర్ట్ రైట్ మోడ్, పనోరమా మోడ్, ప్రో మోడ్, నైట్ విజన్, ఆటో స్మైల్ క్యాప్చర్ ఉంటాయి. ముందు వైపు ఉండే కెమెరా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే బ్యూటీ మోడ్, ఆటో స్మైల్ క్యాప్చర్ ఫీచర్లు ఉంటాయి. మోటో ఈ 13లో 5,000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ రానుంది. 10వాట్ల యూఎస్బీ టైప్ సీ చార్జర్ఱ ఉంటుంది.