Site icon HashtagU Telugu

Motorola g32: మార్కెట్లోకి మోటోరోలా సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర ఫీచర్స్ మామూలుగా లేవుగా?

Motorola Edge 50

Motorola Edge 50

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన మోటోరోలా సంస్థ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. కాగా మోటోరోలా ఇటీవల వరుసగా బడ్జెట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లలో కొత్త కొత్త ఫీచర్ లను పరిచయం చేస్తోంది.

వినియోగదారులను ఆకర్షించడం కోసం మంచి మంచి అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల కోసం మరో సూపర్ స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. కాగా మోటో జీ32 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499, కాగా 8జీబీ రామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999గా ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ ప్రత్యేకత. ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్వోసీ చిప్ సెట్‌తో పనిచేస్తుంది. కాగా కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌ ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఈ మోటోరోలా జీ32 స్మార్ట్‌ ఫోన్‌ 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది. అలాగే 33 వాట్స్‌ టర్బో పవర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.