Site icon HashtagU Telugu

Moto G14: మోటొరోలా నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. ధర రూ.15 వేల కంటే తక్కువ..!

Moto G14

Moto G14

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన మోటోరోలా సంస్థ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. కాగా మోటోరోలా ఇటీవల వరుసగా బడ్జెట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్లలో కొత్త కొత్త ఫీచర్ లను పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల కోసం మరో సూపర్ స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేయనుంది.

వచ్చే నెల అనగా ఆగస్టు 1న మోటో జీ 14 పేరుతో బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. ఈ విషయాన్ని మోటోరోలా సంస్థ తాజాగా వెల్లడించింది. అలాగే ఈ ఫోన్ ప్రీ ఆర్డర్లు కూడా అదే తేదీన అనగా ఆగస్టు 1మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతాయి. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్ల విషయానికొస్తే.. మోటో G14 హ్యాండ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. మోటో G14 ఫోన్ స్మార్ట్‌ఫోన్ మనకు బ్లూ, గ్రే వంటి రెండు కలర్ లలో లభించునుంది. మోటో జీ 14 ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో రానుంది. ముందు భాగం వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో సరికొత్త లుక్‌లో కనిపిస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ జీ 14 స్మార్ట్‌ఫోన్ గ్లాసీ బ్యాక్‌ ప్యానెల్‌తో వస్తుంది.

ఇందులో 50ఎంపీ మెయిన్ సెన్సార్ ఉన్న డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌, దీనికి LED ఫ్లాష్‌ సపోర్ట్ ఉంటాయి. టాప్-సెంటర్ పొజిషన్‌లో ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేశారు. 4జీబీ ర్యామ్ 128జీబీ UFS 2.2 స్టోరేజ్‌, ఆక్టా కోర్ Unisoc T616 SoC ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్-ది-బాక్స్‌ ఆపరేటింగ్ సిస్టమ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఫేస్ రికగ్నిషన్, IP52 రెసిస్టెన్నీ రేటింగ్‌ వంటి స్పెసిఫికేషన్ లు ఈ స్మార్ట్ ఫోన్ లో మనకు లభించనున్నాయి. ఈ ఫోన్‌ 5,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండనుంది. ఇది 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఫోన్ బ్యాటరీ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్ 34 గంటల వరకు టాక్ టైమ్, 16 గంటల వీడియో స్ట్రీమింగ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌కు ఆండ్రాయిడ్ 14కి అప్‌గ్రేడ్ అయ్యే సామర్థ్యం ఉంటుందని, మూడు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని కంపెనీ వెల్లడించింది. ఇకపోతే ధర విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ ధర భారత్ లో రూ.15 వేల కంటె తక్కువే ఉంటుంది అని అంచనా.