Site icon HashtagU Telugu

Motorola: మోటోరోలా నుంచి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే!

Motorola

Motorola

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ మోటోరోలా ఇండియన్‌ మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు ఇప్పటికే మార్కెట్ లోకి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తోంది. అంతే కాకుండా వినియోగదారులందరికీ అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ ని కూడా అందిస్తోంది. ఇది ఇలా ఉండే మోటోరోలా సంస్థ తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. మోటోరోలా తన తాజా 5జీ స్మార్ట్ ఫోన్ మోటో జి 45 5 జీ లాంచ్ తో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో పోటీని పెంచింది.

ఈ కొత్త మోటో డివైజ్ స్నాప్డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 50 మెగా పిక్సెల్ రియర్ కెమెరా ఉన్నాయి. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. మోటో జీ 45 స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .10,999 కాగా, 8 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .12,999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్ ఫోన్ మనకు బ్రిలియంట్ బ్లూ, బ్రిలియంట్ గ్రీన్, వైవా మెజెంటా లాంటి కలర్స్లో లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసేవారు యాక్సిస్, ఐడీఎఫ్సీ బ్యాంక్ కార్డులను ఉపయోగించి చేసే చెల్లింపులపై రూ.1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ ఆఫర్ తో వీటి ధరలు వరుసగా రూ.9,999, రూ.11,999కు చేరాయి.

ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 6.45 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 1600×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ డిస్ప్లే 500 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ ను అందించగలదు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. ఈ ఫోన్ 6 ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్ తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్స్ కోసం అడ్రినో 619 జీపీయూ ఉంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

మోటో జీ 45 5 జీ స్మార్ట్ ఫోన్ లో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై మోటొరోలా యూఎక్స్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఏడాది పాటు ఓఎస్ అప్ డేట్, 3 ఏళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచ్ లను ఈ డివైజ్ తో అందిస్తామని మోటరోలా హామీ ఇచ్చింది. ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.