Motorola Edge 40: మార్కెట్లోకి మోటోరోలా సూపర్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన మోటోర

  • Written By:
  • Publish Date - May 24, 2023 / 04:49 PM IST

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన మోటోరోలా సంస్థ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల కోసం మరో సూపర్ స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసింది. మోటోరోలా ఎడ్జ్ 40 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్ లోకి తీసుకువచ్చింది. 5జీ స్మార్ట్ ఫోన్ సూపర్ స్లిమ్ డిజైన్, ఈ-సిమ్ సపోర్టు, వైర్ లెస్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్ ఉండే పీ ఓఎల్ఈడీ డిస్‍ప్లే వంటి అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర ఫీచర్ల విషయానికొస్తే..

ఈ ఫోన్ కేవలం 7.58 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. స్లీక్ డిజైన్‍తో వచ్చింది. ఈ ఫోన్ బరువు కూడా 171 గ్రాములే ఉంటుంది. రసెడా గ్రీన్, ఎక్లిప్స్ బ్లాక్ కలర్ ఆప్షన్లు వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ ఫినిష్‍ను కలిగి ఉన్నాయి. లునార్ బ్లూ కలర్ వేరియంట్ అక్రిలిక్ ప్యానెల్‍తో వచ్చింది. 6.55 ఇంచుల కర్వ్డ్ ఫుల్ హెచ్‍డీ ప్లస్ పీఓఎల్ఈడీ డిస్‍ప్లేను కలిగి ఉంది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, హెచ్‍డీఆర్10 ప్లస్ సపోర్ట్ ఉంటాయి. గేమింగ్, స్క్రోలింగ్ లేదా మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు, వినియోగదారులు తమ పరికరాన్ని సజావుగా నావిగేట్ చేయడానికి వేగవంతమైన ఫ్లూయిడ్ 144Hz రిఫ్రెష్ రేట్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు.

సినిమా వీక్షణ అనుభవం కోసం డాల్బీ ఆట్మోస్ ఆడియో ఉంటుంది. ఈ ఫోన్‍లో మీడియాటెక్ డైమన్సిటీ 8020 ప్రాసెసర్ ఉంది. ఈ ప్రాసెసర్‌తో లాంచ్ అయిన తొలి మొబైల్‍గా ఇది నిలిచింది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍‍తో ఇది పనిచేస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 40 వెనుక రెండు కెమెరాల సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉండే 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. అల్ట్రా వైడ్ లెన్స్ మాక్రో కెమెరాగానూ ఉయోగపడుతుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‍కు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇకపోతే ఫీచర్ల విషయానికి వస్తే.. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లను ఈ మొబైల్ కలిగి ఉంది. డ్యుయల్ 5జీ సిమ్ సపోర్ట్ ఉంటుంది. ఓ ఫిజికల్ సిమ్, మరో ఈ సిమ్‍కు సపోర్ట్ చేస్తుంది. మిడ్ రేంజ్‍లో ఈ సిమ్ సపోర్టుతో వచ్చిన తొలి ఫోన్‍ ఇదే కావడం విశేషం. మోటోరోలా ఎడ్జ్ 40 మొబైల్‍లో 4,400ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండనుంది. అలాగే 68 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. 15 వాట్ల వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 68 రేటింగ్‍ను ఈ ఫోన్ కలిగి ఉంది. మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ ఒకే వేరియంట్‍లో లాంచ్ అయింది. 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ ధర రూ.29,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ లో ఈ మొబైల్ ప్రీ-ఆర్డర్లు మొదలయ్యాయి. మే 30వ తేదీన ఫ్లిప్‍కార్ట్ సహా మోటోరోలా కంపెనీ వెబ్‍సైట్లో సేల్‍కు వస్తుంది. కాగా ఈ స్మార్ట్ ఫోన్ మనకు ఎక్లిప్స్ బ్లాక్, నెబ్యూలా గ్రీన్, లునార్ బ్లూ వంటి కలర్ ఆప్షన్‍ లలో లభిస్తోంది.