Site icon HashtagU Telugu

Moto Smart Phones: మరో రెండు స్మార్ట్ ఫోన్స్ ని విడుదల చేసిన మోటో.. అద్భుతమైన ఫీచర్స్ తో!

Moto Smart Phones

Moto Smart Phones

ప్రస్తుతం భారత మార్కెట్ లో ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటితోపాటు ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. ఒకదానిని మించి ఒకటి కంపెనీలు అత్యధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా రెండు కొత్త మిడ్ సెగ్మెంట్ స్మార్ట్‌ ఫోన్‌ లను యూరోపియన్ మార్కెట్ లోకి విడుదల చేసింది. త్వరలోనే ఈ రెండు ఫోన్లు భారత మార్కెట్‌ లోకి కూడా లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మోటో జీ55, మోటో జీ35 పేరుతో లాంచ్ చేసిన ఈ రెండు ఫోన్లు కేవలం రూ.19,000 నుంచి రూ.24,000 ధర మధ్య అందుబాటులో ఉండనున్నాయి.

అయితే ఈ రెండు స్మార్ట్‌ ఫోన్‌ లు చాలావరకు ఒకే విధమైన స్పెసిఫికేషన్‌ లను కలిగి ఉన్నాయట. అయితే మోటో జీ 55 కొన్ని స్పెక్స్ కొంచెం మెరుగ్గా ఉన్నాయి. అందుకే మోటో జీ 55 ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. మరి తాజాగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. మోటో జీ 55 యూరోపియన్ మార్కెట్‌లో 249 యూరోల ప్రారంభ ధరతో ప్రారంభించారు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 24,000గా ఉంది. మోటో జీ 35 ధర 199 యూరోలు అంటే దాదాపు రూ. 18,500 గా ఉంది. అయితే రెండు ఫోన్‌లు ఒకే వేరియంట్‌ లలో విడుదలయ్యాయి. మోటో జీ 55 ఫారెస్ట్ గ్రే, స్మోకీ గ్రీన్, ట్విలైట్ పర్పుల్ వంటి మూడు కలర్ లలో విడుదల అయ్యాయి. మోటో జీ 35 లీఫ్ గ్రీన్, జామ రెడ్, మిడ్‌నైట్ బ్లాక్, సేజ్ గ్రీన్ వంటి కలర్ ఆప్షన్‌ లలో లభించునున్నాయి. ఇక మోజీ జీ 55 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ తో 6.49 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120 హెచ్ రిఫ్రెష్ రేట్‌ తో వస్తుంది.

పైగా ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తుంది. మోటో జీ 35 120 హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌ తో 6.7 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. మోటో జీ 55 మీడియా టెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌ తో 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌ లో అందుబాటులో ఉంటుంది. మోటో జీ 35 యూనిసాక్ టీ 760 చిప్‌సెట్‌ తో వస్తుంది. మోటో జీ 55, మోటో జీ 35 రెండు ఫోన్లు వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ ను కలిగి ఉంది. అలాగే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సార్, సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగా పిక్సెల్ కెమెరా ఉన్నాయి. అలాగే ఈ రెండు ఫోన్‌ లు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. అయితే మోటో జీ 55 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ తో వస్తుంటే మోటో జీ 35 మాత్రం 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది.