Site icon HashtagU Telugu

Moto G32: కేవలం రూ. 11 వేలకే అద్భుతమైన మోటో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

Moto G32

Moto G32

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దాంతో నిత్యం మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల అవుతూనే ఉన్నాయి. అలాగే వినియోగదారులను ఆకర్షించడం కోసం ఆయా స్మార్ట్ ఫోన్ కంపెనీలు మార్కెట్ లోకి అద్భుతమైన ఫీచర్లు కలిగిన మొబైల్ ఫోన్ లను విడుదల చేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే మార్కెట్ లో ఎక్కువగా విక్రయించబడుతున్న స్మార్ట్ ఫోన్ లో మోటోరోలా బ్రాండ్ కూడా ఒకటి. ఇది ఇలా ఉంటే తాజాగా మోటోరోలా కంపెనీకి చెందిన మోటో జీ32 స్మార్ట్‌ ఫోన్‌ సేల్స్‌ ప్రారంభమయ్యాయి.

మరి స్మార్ట్ ఫోన్ ధర ఫీచర్స్ విషయానికి వస్తే.. మోటీ జీ32 ఫోన్‌ ప్రారంభ ధర రూ. 11,999గా ఉంది. అలాగే ఇందులో 6.5 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. సూప‌ర్ స్మూత్ 90 హెర్ట్జ్ ఈ స్క్రీన్‌ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఒక్టాకోర్ స్నాప్ డ్రాగ‌న్ 680 ప్రాసెస‌ర్‌తో ఈ ఫోన్‌ పని చేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 50 మెగా పిక్సెల్‌ రి యిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. కాగా ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే.. మోటో జీ32 ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండనుంది.

అలాగే 33 వాట్ల ట‌ర్బో ప‌వ‌ర్ చార్జర్‌ను ఇచ్చారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 8జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ తో లభించనుంది. ఇక ఇందులో సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ను అందించారు. ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌పై పలు కార్డులపై రూ. 1000 డిస్కౌంట్‌ అందిస్తోంది. దీంతో పాటు పాత ఫోన్‌ను ఎక్స్జేంజ్‌ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 5వేల డిస్కౌంట్‌ పొందవచ్చు.