Solar Laptop : సోలార్ యుగం ఇది. వివిధ రకాల సోలార్ ఉత్పత్తులు, ఉపకరణాలు మార్కెట్‌లోకి పోటెత్తుతున్నాయి. తాజాగా సోలార్ లాప్‌టాప్ కూడా వచ్చేసింది. దాని విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :What Is Vantara: ‘వన్ తార’లో ప్రధాని సందడి .. ఏమిటిది ? మోడీ ఏం చేశారు ?
సోలార్ లాప్‌టాప్ గురించి..
- చైనా కంపెనీలు టెక్ రంగంలో దూసుకుపోతున్నాయి.
- టెక్ ఆవిష్కరణలు చేసే విషయంలో అమెరికా కంపెనీల కంటే ఒక అడుగు ముందే ఉంటున్నాయి.
- చైనా కంపెనీ లెనోవో తాజాగా సోలార్(Solar Laptop) లాప్‌టాప్‌ను తయారు చేసింది.
- స్పెయిన్‌లోని బార్సిలోనా వేదికగా జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2025)లో సోలార్ లాప్‌టాప్ నమూనాను లెనోవో కంపెనీ ప్రదర్శించింది.
- ‘యోగా’ మోడల్‌కు చెందిన లాప్‌టాప్‌లో సోలార్ టెక్నాలజీని లెనోవో కంపెనీ చేర్చింది.
- ఈ లాప్‌టాప్ వెనుక ఉండే బ్యాక్ ప్యానెల్ అనేది సోలార్ పవర్‌ను సంగ్రహిస్తుంది. అంటే ఇది సోలార్ ప్యానెల్‌లాగే పనిచేస్తుంది.
- బ్యాక్ కాంటాక్ట్ సెల్ టెక్నాలజీతో ఈ సోలార్ లాప్‌టాప్‌లోని బ్యాక్ ప్యానెల్ పని చేస్తుంది.
- ఎండలో కేవలం 20 నిమిషాలు ఉంచితే ఈ లాప్‌టాప్‌ను గంటపాటు ప్లేబ్యాక్ చేయొచ్చని లెనోవో కంపెనీ తెలిపింది.
- ఈ లాప్‌టాప్‌లో ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ ఉంది.
- లాప్‌టాప్‌ను ఛార్జింగ్ చేయడానికి విద్యుత్ కేబుల్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, ఆరుబయట పనిచేయడానికి ప్రోత్సాహాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ ల్యాపీని తీసుకొచ్చామని లెనోవో వెల్లడించింది.
- ఈ ల్యాపీ 15 మిల్లీమీటర్ల మందంతో ఉంటుంది.
- దీని బరువు 1.22 కిలోలు.
- ప్రపంచంలోనే తొలి అల్ట్రా స్లిమ్ సోలార్ ల్యాపీ ఇదే.
- ఈ లాప్‌టాప్ మార్కెట్‌లోకి వస్తే ఔట్‌డోర్‌లో పనిచేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read :Supreme Court : పాకిస్తానీ అని పిలవడం కించపరిచినట్లు భావించరాదు : సుప్రీంకోర్టు
‘పీఎం కుసుమ్’ పథకానికి అప్లై చేసుకోండి
పొలాల్లో రైతులు సొంతంగా సోలార్ ప్లాంట్లను పెట్టుకోవచ్చు. ఇందుకోసం ‘పీఎం కుసుమ్’ పథకం ద్వారా చేయూతను అందిస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసే గడువును ఈ నెల 10 వరకు పొడిగించారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) ఓ ప్రకటన విడుదల చేసింది. రైతులు, డ్వాక్రా మహిళలు, రైతు సంఘాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, నీటి వినియోగదారుల సంఘాలు రెడ్కో పోర్టల్ ద్వారా దరఖాస్తు పెట్టుకోవచ్చు. రైతులు పొలాల్లో సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 శాతం సబ్సిడీ ఇస్తాయి. పూర్తి వివరాలు పీఎం కుసుమ్ అధికారిక వెబ్‌సైట్ pmkusum.mnre.gov.in లో ఉంటాయి.