Mobile Phone Exports: భారత్ మొబైల్ ఫోన్ ఎగుమతుల్లో అగ్రగామిగా ఐఫోన్. .

మేక్ ఇన్ ఇండియా చొరవతో భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-ఆగస్టు కాలంలో 5.5 బిలియన్ల అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 45,000 కోట్లకు పైగా మొబైల్ ఫోన్‌లను ఎగుమతి చేసింది.

Mobile Phone Exports: మేక్ ఇన్ ఇండియా చొరవతో భారతదేశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-ఆగస్టు కాలంలో 5.5 బిలియన్ల అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 45,000 కోట్లకు పైగా మొబైల్ ఫోన్‌లను ఎగుమతి చేసింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం మరియు పరిశ్రమల డేటా సంయుక్తంగా వెల్లడించాయి.డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ మరియు ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) నివేదిక ప్రకారం.. ఏప్రిల్-ఆగస్టు కాలంలో మొబైల్ ఫోన్ ఎగుమతులు 5.5 బిలియన్లకు చేరాయి. ఏప్రిల్-ఆగస్టు కాలంలో భారతదేశంలో తయారైన ఫోన్ ఎగుమతుల్లో ఐఫోన్ అగ్రగామిగా ఉంది. రెండో స్థానంలో శామ్‌సంగ్ నిలిచింది. మొదటిసారిగా 50 శాతం కంటే ఎక్కువ శామ్‌సంగ్ ఫోన్లు ఎగుమతి అయ్యాయి. జూన్ త్రైమాసికంలోయాపిల్ దేశం మొత్తం 12 మిలియన్ల స్మార్ట్‌ఫోన్లు దాదాపు 50 శాతాన్ని రవాణా చేసింది, శామ్‌సంగ్ 45 శాతం ఎగుమతి చేసింది.ఐఫోన్ 15 సిరీస్ అమ్మకాలు మరియు డిమాండ్ గత సంవత్సరంతో పోలిస్తే 100 శాతం. అంటే 2 రెట్లు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ ఎగుమతుల్లో భారతదేశం రూ. 1,20,000 కోట్లను దాటనుంది. ఇందులో ఆపిల్ 50 శాతానికి పైగా మార్కెట్‌లో అగ్రగామిగా ఉండటం విశేషం.

Also Read: CBN Arrest: చంద్రబాబు జాతీయ నాయకుడు.. గుర్తు పెట్టుకో కేటీఆర్