కొన్ని కొన్ని సార్లు మనం అనుకోకుండా బయటికి వెళ్లినప్పుడు లేదంటే ఏదైనా పనిమీద అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చినప్పుడు మన ఫోన్ యొక్క చార్జర్లను మరిచిపోయి వెళ్తూ ఉంటాం. దాంతో జర్నీలో మొబైల్ ఫోన్ చార్జింగ్ అయినప్పుడు పక్క వాళ్ళ చార్జర్ వైర్ తో అలాగే ఇతర కంపెనీలకు చెందిన చార్జర్ వైర్లతో మొబైల్ ఫోన్లో చార్జింగ్ పెడుతూ ఉంటాం. అయితే ఇలా పెట్టడం వల్ల బ్యాటరీ పనితీరు దెబ్బతింటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ తప్పనిసరి పరిస్థితులలో ఇలా ఇతర చార్జింగ్ వైర్ ని ఉపయోగించి చార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది.
ఒకవేళ ఇతర కంపెనీలకు చెందిన అలాగే వేరే వ్యక్తులకు సంబంధించిన చార్జింగ్ వైర్ లతో మీ మొబైల్ కి ఛార్జింగ్ పెడితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ స్మార్ట్‌ఫోన్ ఇతర ఛార్జర్లకు మద్దతు ఇవ్వదని గుర్తించుకోండి. ఇప్పుడు మీ ఫోన్ 18 వాట్ల ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుందనుకుందాం.. మీరు మీ ఫోన్‌ను మరొక కంపెనీ 80 వాట్ల ఛార్జర్‌ని ఉపయోగించి ఛార్జ్ చేస్తారు. అప్పుడు అడాప్టర్ వాట్స్ ఫోన్ మద్దతు ఉన్న వాట్స్ కంటే ఎక్కువగా ఉంటే, మీ ఫోన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ ఫోన్ ఎన్ని వాట్ల ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుందో ఆ వైర్ ని మాత్రమే ఉపయోగించడం మంచిది.
అలాగే మీరు ఫోన్‌తో వచ్చిన ఒరిజినల్ ఛార్జర్ తో కాకుండా ఏదైనా కంపెనీకి చెందిన ఛార్జర్ తో ఫోన్ ను ఛార్జ్ చేస్తే, మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ దెబ్బతినవచ్చు. ఒరిజినల్ ఛార్జర్‌కు బదులుగా వేరే ఛార్జర్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేయడం వల్ల ఫోన్ వేడెక్కడానికి కారణం కావచ్చు. ఒక్కోసారి విపరీతమైన వేడి ఎక్కి మొబైల్ పేలే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు ఒరిజినల్ ఛార్జర్ ఇంట్లోనే తరచుగా మర్చిపోతుంటారు. మీరు స్థానిక కంపెనీల ఛార్జర్‌తో మీ ఫోన్‌ను రోజూ ఛార్జింగ్ చేస్తూ ఉంటే, ఫోన్ బ్యాటరీ చెడిపోయి, ఫోన్ ద్వారా మంటలు సంభవించే ప్రమాదం పెరుగుతుంది. ఛార్జర్ ఫోన్‌కి అనుకూలంగా లేకుంటే, మీ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం తక్కువగా మారవచ్చు. దీనివల్ల బ్యాటరీ త్వరగా పాడైపోతుంది. ఫోన్‌తో రిటైల్ బాక్స్‌లో వచ్చిన ఛార్జర్‌కు బదులుగా స్థానిక ఛార్జర్ లేదా మరొక కంపెనీ ఛార్జర్‌తో ఫోన్‌ను ఛార్జింగ్ చేయడం వల్ల ఫోన్ స్క్రీన్, హార్డ్‌వేర్ దెబ్బతింటుందని చెబుతున్నారు.