Depression – AI : ‘మూడ్ క్యాప్చర్’.. ముఖం చూసి డిప్రెషన్ గుర్తించే ఏఐ యాప్

Depression - AI : డిప్రెషన్.. ఇప్పుడు అందరినీ వెంటాడుతున్న అతిపెద్ద సమస్య.

  • Written By:
  • Publish Date - March 2, 2024 / 09:55 AM IST

Depression – AI : డిప్రెషన్.. ఇప్పుడు అందరినీ వెంటాడుతున్న అతిపెద్ద సమస్య. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు వచ్చినా మనిషి డిప్రెషన్‌లోకి జారుకుంటాడు. ఏదైనా ప్రయత్నంలో మనం విఫలమైనప్పుడు కూడా డిప్రెషన్ చుట్టుముడుతుంటుంది. ప్రత్యేకించి ఈతరం యువత, స్కూల్ పిల్లలు, వృద్ధులను కూడా  డిప్రెషన్ పట్టిపీడిస్తోంది. దాని బారినపడి ఎలా బయటపడాలో తెలియక ఎంతోమంది ప్రాణాలు తీసుకోవడాన్ని మనం చూస్తున్నాం.  ‘ఆత్మహత్య మహాపాపం’ అని పురాణాలు ఘోషిస్తున్నా  మనం పట్టించుకోవడం లేదు. ఆత్మహత్యతో సమస్యలకు పరిష్కారం దొరకదు. ఆలోచన, ఆత్మవిశ్వాసం, సహనంతో సమస్యలను అధిగమించవచ్చు. ఈనేపథ్యంలో డిప్రెషన్‌ను గుర్తించే అధునాతన ఆర్టిఫీషియల్ టెక్నాలజీ (ఏఐ) యాప్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. దానిపేరు ‘మూడ్ క్యాప్చర్’ (MoodCapture). వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

యాప్‌ ఇలా పనిచేస్తుంది.. 

  • మనం ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి రోజుకు కొన్ని వందల సార్లు మన ఫోన్‌ను లాక్ తీస్తుంటాం. అదే టెక్నాలజీకి ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీని జోడించి  ఈ మూడ్ క్యాప్చర్ యాప్‌ను డెవలప్ చేశారు.
  • ఏఐ లెర్నింగ్ టెక్నాలజీ, ఏఐ హార్డ్‌వేర్ టెక్నాలజీని ఈ యాప్ తయారీకి వాడారు. ఫలితంగా యూజర్లు సులభంగా ‘మూడ్ క్యాప్చర్’ యాప్‌ను  ఉపయోగించవచ్చు. ‘మూడ్ క్యాప్చర్’ యాప్.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీతో పనిచేస్తుంది.
  • ఈ యాప్ మన ముఖ కవళికల ఆధారంగా డిప్రెషన్‌ను గుర్తిస్తుంది. మూడ్ క్యాప్చర్ యాప్‌ను తెరిచి ఫోన్ ఫ్రంట్ కెమెరాతో మన ముఖం, చుట్టుపక్కల వాతావరణం చూపించాలి. వాటి ఆధారంగా ఆ యాప్ డిప్రెషన్ లక్షణాలను గుర్తిస్తుంది. మీరు డిప్రెషన్‌లో ఉన్నారా ? లేదా ? అనేది చెప్పేస్తుంది.
  • మూడ్ క్యాప్చర్ యాప్.. యూజర్‌లోని డిప్రెషన్ లక్షణాలను గుర్తించిన తర్వాత, డిప్రెషన్ ఉన్నట్టు నేరుగా మనకు చెప్పదు.  కాసేపు అలా బయట తిరిగి రమ్మని.. ఫ్రెండ్స్ తో మాట్లాడమని.. పరిస్థితికి తగిన విధంగా సూచనలు చేస్తుంది.
  • దీనివల్ల డిప్రెషన్‌లో ఉన్నవారు వెంటనే మానసిక వైద్యుడిని సంప్రదించే అవకాశం కలుగుతుంది.అయితే  ఈ యాప్ డిప్రెషన్‌ను ఎంతమేర కచ్చితత్వంతో గుర్తిస్తుంది  అనేది పెద్ద ప్రశ్న.

Also Read : Tower of London : ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌’.. ‘కాకుల మాస్టర్‌’‌ కథ

  • మూడ్ క్యాప్చర్ యాప్ పనితీరుపై గతంలో అధ్యయనం చేయగా 75 శాతం డిప్రెషన్ లక్షణాలను కచ్చితత్వంతో గుర్తించింది.
  • బ్రిటన్‌లోని ప్రతి ఐదుగురు యువతలో ఒకరికి డిప్రెషన్ ఉన్నట్లు గుర్తించారు.
  • ప్రతి 10 మందిలో వారానికి ముగ్గురు డిప్రెషన్ బారిన పడుతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి.
  • మేజర్ డిప్రెస్సివ్ డిజార్డర్ బారిన పడిన 177 మంది మీద 90 రోజుల పాటు ఈ యాప్ ను పరీక్షించినపుడు, అది 1,25,000 ఇమేజ్ లను పరీక్షించి, సరైన ఫలితాలను ఇచ్చింది.
  • ఈ యాప్ పనితీరు సానుకూలంగా ఉండటంతో, వచ్చే ఐదేళ్లలో అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు.
  • ఈ యాప్ ని పరీక్షించినపుడు వచ్చిన సానుకూల ఫలితాలను బట్టి, మరో ఐదేళ్ల లోపు యూజర్లకు అందుబాటులోకి తెస్తామని పరిశోధకులు అంటున్నారు. అయితే ఈ యాప్ 90% సరైన ఫలితాలు ఇచ్చేంత వరకు దీన్ని మార్పులు చేస్తూ, పరిశీలించనున్నారు.

Also Read : Womens Day : ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’.. చరిత్ర, 2024 థీమ్ వివరాలివీ