తినడం మానేస్తారు కానీ మొబైల్ లేనిది మాత్రం ఉండలేరు. నేటికాలంలో స్మార్ట్ ఫోన్లు మనుషుల జీవితాలను శాసించే స్థాయికి చేరుకున్నాయి. మొబైల్ లేకుండా నిమిషం కాదు సెకన్ కూడా ఉండలేని పరిస్థితికి దిగజారారు. కొంతమంది నిద్ర లేచింది మొదలు అర్థరాత్రి పడుకునేంత వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే. మొబైల్ అతిగా వినియోగించడం వల్ల వచ్చే అనార్థాల గురించి వైద్యులు ఎంత హెచ్చరించినా…పెడచెవిన పెడుతున్నారు. ఫోన్ వ్యసనం అనేది ఎంత ప్రమాదకరమో తెలుస్తే మీరుషాక్ అవుతారు.
ఫోన్ వ్యసనం ఎందుకు ప్రమాదకరం?
మొబైల్ వ్యసనం అనేది మీ వ్యక్తిగత జీవితలో జోక్యం చేసుకోవడం ప్రారంభిస్తే…దాని నుంచి బయటపడటం చాలా కష్టం. ఆఫీసులో, కాలేజీలో, ఇంట్లో,ఈవెంట్లో ఇలా ఎక్కడైనా మీరు ఫోన్ లో నిమగ్నమై ఉంటే…దీని ప్రభావం మీపై కనిపిస్తుంది. ఈ వ్యసనం మీ నిజజీవితానికి దూరంగా ఉండేలా చేస్తుంది. ఎవరితోనూ మాట్లాడకుండా, అందరికీ దూరంగా ఉండేలా చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని ఒంటరి చేస్తుంది. మీరు వీలైనంత త్వరగా ఈ వ్యసనం నుంచి బయటపడటం చాలా ముఖ్యం. అయితే మొబైల్ వ్యసనం నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.
1. బెడ్ దగ్గర మొబైల్ ఛార్జింగ్ పెట్టకండి:
చాలా మంది తాము నిద్రించే బెడ్ దగ్గర చార్జర్ పాయింట్ పెట్టుకుంటారు. మీరు మొబైల్ వ్యసనం నుంచి బయటపడాలంటే బెడ్ కు దూరంగా ఛార్జింగ్ పెట్టండి. ఇలా చేయడం మొబైల్ ఛార్జింగ్ అయ్యేంత వరకు దానికి దూరంగా ఉంటారు. వేరే పనిలో నిమగ్నం అవ్వడం వల్ల కొంతసేపు ఫోను నుంచి విముక్తి పొందుతారు.
2.ఫోన్ లో అలారం :
మొబైల్ లో అలారం పెట్టకూడదు. మొబైల్స్ వచ్చాక…ఇళ్లలో అలారం గడియాలు లేకుండా పోయాయి. అయితే మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడాలంటే మొబైల్ కాకుండా గడియారంలో అలారం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు లేచి మొబైల్ చూడకుండా ఉంటారు. ఉదయాన్నే మొబైల్ చూసే అలవాటు మానుకోవాలి.
3. నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి:
మీ మొబైల్లో నోటిఫికేషన్లు ఆఫ్ చేయాలి. ఇతర పనుల్లో బిజీగా ఉన్నట్లయితే…ఆ సమయంలో ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఆఫ్ చేయాలి. ఏదో పనిలో బిజీగా ఉంటాం…అదే సమయంలో నోటిఫికేషన్ వస్తుంది…పనిని వదిలినపెట్టి..నోటిఫికేషన్ చూడటం ప్రారంభిస్తాం. ఇలా చేస్తే పని నుంచి మన ద్రుష్టి మరలుతుంది.
4. పనికిరాని యాప్స్ డిలీట్ చేయండి:
ఫోన్లో మీకు ఉపయోగపడని యాప్స్ ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేయండి.
5. వారానికి ఒకసారి ఫోన్ లేకుండా ఉండేలా ప్రయత్నించండి.
సెకను ఉండటమే కష్టం..ఒకరోజు ఎలా ఉంటాం అనుకుంటున్నారా? మీరు మొబైల్ వ్యసనం నుంచి బయటపడాలంటే ఇలా చేయడం తప్పనిసరి. వారంలో ఒకరోజు ఫోన్ లేకుండా ఉండేలా ప్రయత్నించండి. క్రమంగా ఇది అలవాటుగా మారుతుంది.