Site icon HashtagU Telugu

Pan Card Corrections: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? అయితే ఇలా మార్చుకోండి!

Pan Card

Pan Card

భారతీయులకు పాన్ కార్డ్ అన్నది తప్పనిసరి. పాన్ కార్డు అన్నది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాకుండా ఆర్థిక లావాదేవీలకు కీలకం అని చెప్పవచ్చు. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో పాన్ కార్డుకి సంబంధించిన సమస్యలతో చాలామంది విసుగు చెందుతూ ఉంటారు. అయితే అప్పుడు కష్టమని అనిపించినా కూడా ఆ పాన్ కార్డులను సరి చేసుకోకపోతే మళ్లీ భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అయితే కొంతమంది పాన్ కార్డు సమస్యలను మళ్లీ చేసుకోవచ్చులే అని నెగ్లెట్ చేస్తూ ఉంటారు. అయితే పాన్ కార్డులలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఆదాయపు పన్ను శాఖ లేదంటే ఎస్ఎస్డిఎల్ ని సంప్రదించాలి. అలాగే ఆదాయపు శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కు కూడా కాల్ చేసి మీ పాన్ కార్డు సమస్య గురించి సమాచారం తెలుసుకోవచ్చు. లేదంటే ఆదాయపు శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కు ఈ మెయిల్ కూడా చేయవచ్చు.

అంతేకాకుండా ఎస్ఎస్ డిఎల్ లో ఎస్ఎంఎస్ ను కూడా చేయవచ్చు. ఇందుకోసం NSDLPAN రసీదు సంఖ్యను 57575కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఈ విధంగా పాన్ కార్డు లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు. పాన్ కార్డు సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలామంది ఈ విషయం పట్ల సరైన అవగాహన లేక పాన్ కార్డు సమస్యలు ఉన్నా కూడా వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు.

Exit mobile version