Site icon HashtagU Telugu

UPI: యూపీఐ నగదు బదిలీ విషయంలో పొరపాటా.. ! తిరిగి ఇలా డబ్బును పొందండి.

994953 947635 Upi Transactions India

994953 947635 Upi Transactions India

UPI: ఒకప్పుడు నగదు లావాదేవీలకు బ్యాంకుకి వెళ్లాల్సి వచ్చేది.. కానీ ప్రస్తుతం ఈ విషయం చాలా తేలిక అయిపోయింది.. కారణం ఆన్లైన్ పేమెంట్లు వచ్చేసాయి.. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంతో డబ్బును ఒకరి ఎకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి పంపించడం చాలా తేలిక అయిపోయింది.. అలాగే ఈ విషయం క్షణాల్లో జరగబోతుంది.. ఎవరికైనా డబ్బు పంపించాలి అనుకుంటే సెకండ్లలో ఒకరు అకౌంటు నుంచి వేరే అకౌంట్ కి పంపించేస్తున్నారు. అయితే ఈ సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాంగ్ యూపీఐ కొట్టినప్పుడు డబ్బు పంపించాల్సిన వారికి కాకుండా మరొకరికి వెళ్ళిపోతుంది. అయితే ఇలాంటి సమయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్లీ మీ డబ్బులు మీరు పొందవచ్చు.. అంటూ హామీ ఇస్తున్నారు ఆర్థిక నిపుణులు అది ఎలా అంటే..

యూపీఐ ఐడి వచ్చాక క్షణాల్లో డబ్బును ఒకరి ఎకౌంట్ నుంచి ఇంకొకరి ఎకౌంట్కి బదిలీ చేయడం చాలా తేలిక అయిపోయింది. అవతల వ్యక్తి ఫోన్ నెంబర్ ఉన్న.. క్యూఆర్ స్కాన్ ఉన్న వెంటనే ఎంత దూరంలో ఉన్న డబ్బును పంపించవచ్చు.. అయితే ఇలాంటి సమయంలో ఏమాత్రం ఒక్క నెంబర్ తప్పుగా కొట్టిన డబ్బు వేరే ఎకౌంట్కి వెళ్లిపోయే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమయంలో వినియోగదారులు కంగారు పడాల్సిన అవసరం లేకుండా ఒక చిన్న ఫిర్యాదుతో తిరిగి తమ డబ్బును పొందవచ్చు అని తెలుస్తోంది..

ఒకవేళ డబ్బును తప్పు ఎకౌంట్కి పంపినట్టు మీరు గమనించిన వెంటనే ఫోన్కు డబ్బులు డెబిట్ అయినట్టు వచ్చిన మెసేజ్ ను సేవ్ చేసుకోవాలి.. అలాగే యూపీఐ లో డబ్బులు పంపిన స్క్రీన్ షాట్ ను ఫోన్లో సేవ్ చేసుకోవాలి.. అలాగే యూపీఐ కలిగించే మరొక సౌకర్యం ఏంటంటే దాదాపు రెండేళ్లపాటు ఇందులో హిస్టరీ డిలీట్ అవ్వదు.. ఇది కూడా ఒక అందుకు వినియోగదారుడికి ఉపయోగపడుతుందని చెప్పాలి..

అయితే ఫిర్యాదు కొరకు మీరు ఏ ఆన్లైన్ అప్ ఉపయోగించారో వారికి ఇన్ఫార్మ్ చేయాలి. ఇందుకోసం కస్టమర్ కేర్ ను సంప్రదించాలి. ప్రతి ఆన్లైన్ పేమెంట్ యాప్ కూడా కస్టమర్ కేర్ లను మెయింటైన్ చేస్తుంది. వీరికి ఫిర్యాదు చేయడం వల్ల వారి సమస్యను చాలా వరకు పరిష్కరిస్తారు.. అలాగే ఇలా సమస్య పరిష్కారం కాకపోతే ఎన్పీసీఐ పోర్టల్ లో కూడా మీ సమస్యను తెలియజేయవచ్చు. నేరుగా గూగుల్ నుంచి దీనిలో లాగిన్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇలాంటి విషయాల్లో ఆన్లైన్లో ఎక్కువ మోసాలు జరుగుతూ ఉంటాయి. అందుకే అఫీషియల్ వెబ్సైట్లో చూసుకొని లాగిన్ అవ్వాలి.. ఈ రెండు విధాల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే అంబుడ్స్మాన్ ను సంప్రదించాలి.. bankingombudsmen.rbi.org.in లో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఈ విషయాన్ని బ్యాంకు ద్వారా కూడా పరిష్కరించుకోవచ్చు.. అయితే ఈ పై విధాల ద్వారా డబ్బును తిరిగి పొందలేని సమయంలో చట్టబద్ధంగా వెళ్లి డబ్బును వెనక్కి తెచ్చుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం మీ దగ్గర ఉంచుకోవడం అవసరం..

Exit mobile version